ముస్లిం యువ‌కుల‌కు జ‌గ‌న్ అదిరిపోయే హామీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-09-05 15:45:21

ముస్లిం యువ‌కుల‌కు జ‌గ‌న్ అదిరిపోయే హామీ

అధికార‌ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఆంధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన నారా హ‌మారా... టీడీపీ హ‌మారా స‌భ‌లో ముస్లిం యువ‌కులు త‌మ‌కు టీడీపీ మేనిఫెస్టోలో పొందుప‌రిచిన హామీల‌ను నెర‌వేర్చాల‌ని ఫ్ల‌కార్డ్స్ ప‌ట్టుకుని నిర‌స‌న‌లు తెలిపిన సంగ‌తి తెలిసిందే. త‌న స‌భ‌కే వ్య‌తిరేకం చూపుతారా అన్న నెపంతో చంద్ర‌బాబు నాయుడు తొమ్మిదిమంది ముస్లిం యువ‌కుల‌ను అధికార బ‌లంతో అరెస్ట్ చేయించి వారిని 30 గంట‌లు న‌ర‌కం చూపించారు. 
 
ఇక ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ట్విట్ట‌ర్ ద్వారా స్పందించిన సంగ‌తి తెలిసిందే. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ మేనిఫెస్టోలో పొందుప‌రిచిన అంశాల‌ను అడితే ముస్లిం యువ‌కుల‌ను నిర్భందించ‌డం ఎంత‌వ‌ర‌కు న్యాయం అని ప్రశ్నించారు. 
 
అయితే తాజాగా అరెస్ట్ అయిన తొమ్మిది మంది ముస్లిం యువ‌కులు పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లుసుకున్నారు. అధికార బ‌లంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు త‌మ‌ను అక్ర‌మంగా అరెస్ట్ చేయించారు అంటూ వారు త‌మ‌గోడును జ‌గ‌న్ వివ‌రించారు. ఇక ఈ సంఘ‌ట‌న గురించి వైఎస్ జ‌గ‌న్ వారిని అడిగి పూర్తిగా వివ‌రాలు తులుసుకున్న త‌ర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే ముస్లిం యువ‌కుల‌పై పెట్టిన కేసుల‌న్ని ఎత్తివేస్తామ‌ని వారికి హామీ ఇచ్చారు జ‌గ‌న్ 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.