జ‌గ‌న్ కు ఆ విష‌యంలో సెల్యూట్ చెయ్య‌లి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-06 02:35:57

జ‌గ‌న్ కు ఆ విష‌యంలో సెల్యూట్ చెయ్య‌లి

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీ స్థాపించిన‌ప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కూ ప్ర‌జ‌ప‌క్షాణ నిలుస్తూ వారి స‌మస్య‌ల‌పై నిరంత‌రం పోరాడుతూనే ఉన్నారు జ‌గ‌న్... ఇక దీంతో పాటు అధికార తెలుగు దేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అరాచ‌కాల‌ను ఎండ‌గ‌డుతూ... రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అండగా నిలుస్తున్నారు జ‌గ‌న్...  త‌న తండ్రి అడుగు జాడ‌ల్లో న‌డుస్తూ నిత్యం ప్ర‌జ‌ల ర‌క్ష‌ణే త‌న ర‌క్ష‌ణ‌గా బావిస్తూ కోట్లాది ప్ర‌జ‌ల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు జ‌గ‌న్.
 
గ‌త ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప మెజారిటీతో అధికారాన్ని కోల్పోయిన వైఎస్ జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారంలో వ‌చ్చి పాడుబ‌డిన రాజ‌కీయ వ్య‌వ‌స్త‌ను పారద్రోలేందుకు సిద్ద‌మ‌య్యారు జ‌గ‌న్... ఈ క్ర‌మంలో ఆయ‌న మండుటెండ‌ల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌ను చేప‌ట్టారు... ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో ప్ర‌తీ ఒక్క‌రికి నేనున్నాను అంటు.. భ‌రోసా ఇస్తూ ముందుకుసాగుతున్నారు జ‌గ‌న్.
 
ఇక తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న త‌ర్వాత  ఏపీలో ఏవిధంగా  ప‌రిణామాలు చోటు చేసుకున్నాయో మ‌నంద‌రికీ తెలిసిన విష‌య‌మే... ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వెంక‌న్న సాక్షిగా న‌ష్టాల్లో వున్న ఏపీకి... మోడీ బీజేపీ అధికారంలోకి వ‌స్తే ప్ర‌త్యేక హోదాను  ప‌ది సంవ‌త్స‌రాలు... దీంతోపాటు విశాఖ రైల్వే జోన్ వంటి అంశాలు వెంట‌నే కేటాయిస్తామ‌ని చంద్ర‌బాబు స‌మ‌క్షంలో చెప్పారు. 
 
అయితే త‌మ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ప‌ది సంవ‌త్స‌రాలు కాదు 15 సంవ‌త్స‌రాలు కేటాయించాల‌ని కోరారు... కానీ చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌త్యేక హోదా వ‌ల్ల రాష్ట్రాని ఎటు వంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని, ప్ర‌త్యేక ప్యాకేజీ వ‌ల్ల అధిక లాభాలు ఉంటాయ‌ని ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టారు... అయితే ప్ర‌తిప‌క్షనేత వైఎస్ జ‌గ‌న్ మాత్రం ప‌ట్టిన ప‌ట్టు వ‌ద‌ల కుండా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కేటాయించాల‌ని గ‌త నాలు సంవ‌త్స‌రాలు పోరాడుతూనే ఉన్నారు.
 
ఈ క్ర‌మంలో ప్ర‌త్యేక హోదాను డిమాండ్ చేస్తూ వైసీపీ నాయ‌కుల‌తో క‌లిసి అమ‌రావ‌తిలో నిరాహార దీక్ష చేయ‌బోతే చంద్ర‌బాబు నాయుడు ప్ర‌ధాని మోడీ వ‌స్తున్నారంటూ అక్ర‌మంగా అధికారుల‌తో దీక్ష‌ను బ‌గ్నం చేయించారు... అయినా కానీ జ‌గ‌న్ త‌న ప‌ట్టును వీడ‌లేదు...ఆనాటి నుంచి ఈనాటి వ‌ర‌కూ జ‌గ‌న్ ఒకే వాద‌న ఆమ‌ర సంజీవ‌ని అయిన ప్ర‌త్యేక హోదా... అందుకే రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ ఈ విష‌యంలో జ‌గ‌న్ కు మ‌స్పూర్తిగా సెల్యూట్ చేయాల‌ని రాష్ట్ర వ్యాప్తంగా అంటుంటారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.