వారిని గుర్తించ‌డంలో బాబుకంటే జ‌గ‌న్ బెట‌ర్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-25 11:01:25

వారిని గుర్తించ‌డంలో బాబుకంటే జ‌గ‌న్ బెట‌ర్ ?

తెలుగుదేశం వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు  హ‌యాం నుంచి ప్ర‌స్తుతం సీఎం చంద్ర‌బాబు నాయ‌క‌త్వం వ‌ర‌కూ మైనార్టీలు టీడీపీకి అండ‌గా నిల‌బ‌డ్డారు. అయితే మైనార్టీల‌కు ఏ రోజు కూడా పార్టీలో స‌ముచితమైన‌ స్థానం క‌ల్పించ‌లేదు తెలుగుదేశం స‌ర్కార్‌. 
 
గత ఎన్నిక‌ల్లో 175 నియోజ‌క‌వ‌ర్గాల‌లో క‌నీసం ఒక్క సీటు కూడా మైనార్టీల‌కు కేటాయించ‌లేదు చంద్ర‌బాబు పార్టీ . అయినా టీడీపీ విజ‌యానికి అత్యంత కృషి చేశారు మైనార్టీలు... అయితే అధికారంలోకి వ‌చ్చిన తెలుగుదేశం ప్ర‌భుత్వం, నాలుగేళ్లు గ‌డుస్తున్నా, ఇంత వ‌ర‌కూ మైనార్టీల‌కు ఎలాంటి సంక్షేమ ప‌థ‌కాలు  ప్ర‌వేశపెట్ట‌క పోవ‌డం దారుణం. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా ముస్లింలు తనకు అండగా నిలవాలని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు చేశారు.
 
దీనికి స్పందించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మహ్మద్‌ ముస్తఫా  మీడియాతో మాట్లాడుతూ మైనార్టీల  సంక్షేమం కోర‌ని చంద్ర‌బాబు పార్టీకి బాస‌ట‌గా నిల‌వాల‌ని కోర‌డం విడ్డూరంగా ఉంద‌ని అన్నారు. మైనార్టీలకు  4శాతం రిజ‌ర్వేష‌న్‌లు కేటాయించిన ఘ‌న‌త దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికే ద‌క్కింద‌ని, ఎమ్మెల్యే ముస్తఫా తెలిపారు. దాన్ని తూచా త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తున్న ఘ‌న‌త కూడా వైయ‌స్ జ‌గ‌న్‌కే చెందింద‌ని అన్నారు.
 
గ‌త ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ త‌రుపున మైనార్టీలకు 4సీట్లు కేటాయించి వారిని గెలిపించుకున్న ఘ‌న‌త కూడా  జ‌గ‌న్‌కే సాధ్యం అయింద‌ని అన్నారు.... సీఎం చంద్ర‌బాబుకి క‌ష్టాలున్న‌ప్పుడే  మైనార్టీలు గుర్తుకు వ‌స్తార‌ని అన్నారు.. టీడీపీ ఏం చేసింద‌ని తాము అండగా నిలవాలో చెప్పాలని ఎమ్మెల్యే ముస్తఫా  చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు.గ‌త ఎన్నిక‌ల్లో మైనార్టీల‌కు చంద్ర‌బాబు స‌ర్కారు ఎటువంటి టికెట్ ఇవ్వ‌లేదు అలాగే ఇటీవ‌ల మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో కూడా  మైనార్టీ వ‌ర్గానికి చెందిన ఎవ‌రికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు.. అలాగే నంద్యాల ఉప ఎన్నిక స‌మ‌యంలో మాజీ మంత్రి ఫ‌రూఖ్ కు ఎమ్మెల్సీ ఇచ్చారు బాబు, మైనార్టీ ఓట్ల కోసం అనేది ఇప్ప‌టికీ రాష్ట్రంలో చ‌ర్చించుకుంటారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.