వైసీపీ రాజ్యసభ అభ్యర్థిని ప్ర‌క‌టించిన జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan mohan reddy image
Updated:  2018-03-03 04:48:01

వైసీపీ రాజ్యసభ అభ్యర్థిని ప్ర‌క‌టించిన జ‌గ‌న్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్య‌క్ర‌మాలు ఒక్కొక్క‌టి చురుకుగా జ‌రుగుతున్నాయి.. ప్ర‌త్యేక హూదా కోసం కేంద్రంతో పోరాటానికి రెడీ అయింది వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఇక జెండా ఊపి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ప్ర‌కాశం జిల్లా పాద‌యాత్ర నుంచి వైసీపీ నాయ‌కుల‌ను దిల్లీ పంపించారు.. సోమ‌వారం నాడు దిల్లీలో ధ‌ర్నా చేయ‌నున్నారు, ఏపీకి ప్ర‌త్యేక హూదా సాధ‌నే ల‌క్ష్యంగా.
 
ఈ కార్య‌క్ర‌మానికి ముందు వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు అందరితో జ‌గ‌న్ స‌మావేశం ఏర్పాటు చేశారు.. ఆ స‌మ‌యంలో పార్టీ పార్ల‌మెంట్లో అనుస‌రించ‌వ‌ల‌సిన‌ వ్యూహాల పై చ‌ర్చించారు... పార్టీ నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశారు జ‌గ‌న్.. ఇక వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డిని నేతలు, కార్యకర్తలకు పరిచయం చేశారు.. రాజ్యసభ ఎన్నికలకు ఈ నెల 7వ తేదీన వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి నామినేషన్ వేయనున్నారు అని తెలియ‌చేశారు.
 
ఇక తెలుగుదేశం ఎటువంటి నిర్ణ‌యం తీసుకుందో ప్ర‌త్యేక హూదా విష‌యంలో తెలియ‌డం లేదు.. అలాగే కేంద్రంతో జ‌త‌క‌డుతూ వారిని విమ‌ర్శించి ఇక్క‌డ ప‌బ్బం గ‌డుపుతున్నారు అనే విమ‌ర్శ‌లు బీజేపీ నుంచి రాష్ట్రంలో వినిపిస్తున్నాయి.. అలాగే పార్టీ త‌ర‌పున జ‌గ‌న్ మొద‌టిగా రాజ్య‌స‌భ అభ్య‌ర్దిని ప‌రిచ‌యం చేశారు.. ఇటు తెలుగుదేశం ఎవ‌రికి సీటు ఇస్తుందా అనేది ఇంకా చ‌ర్చ‌లు జ‌రుపుతోంది.. ఇటు జేపీ పేరు వినిపిస్తోంది..అలాగే  సీఎం ర‌మేష్ మ‌రోసారి అవ‌కాశం కోసం చూస్తున్నారు... ఇక మంత్రి సీనియ‌ర్ నాయ‌కుడు య‌న‌మ‌ల పేరు కూడా వినిపిస్తోంది ..చూడాలి తెలుగుదేశం ఎప్పుడు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తుందో రాజ్య‌స‌భ అభ్య‌ర్దుల విష‌యంలో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.