సంక‌ల్ప‌యాత్ర సాక్షిగా జ‌గ‌న్ మ‌రో కొత్త హామీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-23 11:12:26

సంక‌ల్ప‌యాత్ర సాక్షిగా జ‌గ‌న్ మ‌రో కొత్త హామీ

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ  కంచుకోట అయిన కృష్ణా జిల్లా నూజివీడులో నిర్విరామంగా కొన‌సాగుతోంది... ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను వివ‌రిస్తూ తాము అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌ల‌జ‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.  
 
ఇక తాజాగా నూజివీడులో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మ‌రోసారి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై ప్ర‌జల‌ స‌మ‌క్షంలో ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు జ‌గ‌న్ ... మ‌హాత్మా గాంధీని చంపిన గాడ్సే దీక్ష చేస్తే ఎలా ఉంటుందో చంద్ర‌బాబు కూడా దీక్ష చేస్తే అలాగే ఉందని జ‌గ‌న్ ఆరోపించారు... పార్ల‌మెంట్ చివ‌రి స‌మావేశాల‌ రోజున వైసీపీ ఎంపీల‌తో పాటు చంద్ర‌బాబు త‌న ఎంపీల‌తో రాజీనామా చేయించి ఉంటే రాష్ట్రానికి ఇంత ప‌రిస్థితి వ‌చ్చేది కాద‌ని మండిప‌డ్డారు.
 
స్పీక‌ర్ స‌భ‌ను నిర‌వ‌ధిక వాయిదా వేసిన‌ప్పుడు 25కు 25 మంది ఏకదాటిగా ఎంపీలు అంద‌రు క‌లిసి రాజీనామా చేస్తే రాష్ట్రానికి  ప్ర‌త్యేక హోదా వ‌స్తుంద‌ని తెలిసి కూడా చంద్ర‌బాబు త‌మ‌ ఎంపీల‌తో రాజీనామా చేయించ‌కుండా డ్రామాలు ఆడార‌ని మండిప‌డ్డారు జ‌గ‌న్...పెద‌బాబు మ‌ట్టి నుంచి ఇసుక దాక వ‌ద‌ల‌కుండా దోచుకుంటున్నార‌ని, అలాగే గుడి భూములను సైతం విచ్చ‌ల‌విడిగా దోచుకుంటున్నార‌ని జ‌గ‌న్ ఆరోపించారు.. దీంతో పాటు నిన్న చంద్ర‌బాబు నాయుడు దీక్ష‌లో సిగ్గులేకుండా  త‌న‌కు 25 మంది ఎంపీలు కావాల‌ని అంటున్నార‌ని మండిప‌డ్డారు జ‌గ‌న్.
 
మ‌న రాష్ట్రంలో చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక రైత‌న్న‌ల ప‌రిస్థితి అద్వానంగా మారుతోంద‌ని, తాము అధికారంలోకి వ‌స్తే ప్ర‌తీ ఒక్క‌రైతును ఆదుకుంటామ‌ని జ‌గ‌న్ భ‌రోసా ఇచ్చారు.. రాష్ట్రంలో ఉన్న  రైత‌న్న‌కు  ప్ర‌తీ మే నెల‌లోపెట్టుబ‌డుల కింద 12,500 రూపాయ‌లు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు.... అలాగే ప‌గ‌టి పూట రైతులు క‌ష్ట‌ప‌డ‌కుండా ప్ర‌తీ రోజు 9 గంట‌ల పాటు ఉచితంగా క‌రెంట్ అందిస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు.. దీంతోపాటు వ‌డ్డీలేని రుణాల‌ను పున‌రుద్ద‌రిస్తామ‌ని, ప్ర‌తీ రైతన్న‌కు త‌మ భూముల్లో  ఉచితంగా బోర్లు వేయిస్తామ‌ని తెలిపారు. 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.