జగన్ కి అందుకే అంత గర్వం...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-06 12:33:52

జగన్ కి అందుకే అంత గర్వం...

జగన్ రాజకీయాలలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకూ నాయకులలో బాగా వినిపిస్తున్న మాట గర్వం...జగన్ కి గర్వం ఎక్కువ... జగన్ తన పద్ధతులు మార్చుకోవాలి...లేకపొతే చాల ఇబ్బందులు పడతాడు అని? జగన్ కి గర్వం ఉంది అంటున్న నాయకుల మాటల్లో నిజమెంత? ఇంత చిన్న వయసులోనే జగన్ కి గర్వం ఎందుకు అని?
 
తన తండ్రి చనిపోయినప్పుడు ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఢిల్లీ అహంకారాన్ని ఎదిరించినందుకా? కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడటానికి భయపడే మన నాయకులు... ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్ అధినేత్రిని  జగన్ ఏదిరించినందుకా? నాలుగేళ్ళ పదవి కాలం ఉన్న, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని ఎదిరించి  పార్టీ నుండి బయటకు వచ్చినందుకా? ఎదిరిస్తే ఇబ్బందులు పెడతారని తెలిసిన ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉన్నందుకా? కాంగ్రెస్ పార్టీ - టీడీపీతో కలిసి చీకటి రాజకీయాలు చేసి జైలుకు పంపించిన ధైర్యంగా ఎదుర్కుంటునందుకా? ఎందుకు జగన్ కి అంత గర్వం..
 
ఒక పక్క చంద్రబాబు, మోడీ, పవన్ తో కలిసి సుమారు 600 హామీలు ప్రకటించినా...నేను ఓడిపోయినా పర్వాలేదు ఆచరణ సాధ్యం అయ్యే హామీలనే ప్రకటించి ఎన్నికలకు వెళ్ళినందుకా? అక్రమ కేసులు పెట్టిన చంద్రబాబులాగా స్టేలు తెచ్చుకోకుండా ధైర్యంగా ఎదుర్కుంటునందుకా? జగన్ ని ముఖ్యమంత్రిని చేయాలని 156 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన తిరస్కరించినందుకా? ఎందుకో జగన్ లో ఆ గర్వం మిరే చెప్పాలి?  
 
అసెంబ్లీలో 40 ఏళ్ల అనుభవం, నలభై ఏళ్ల కుర్రాడి మాట్లాడుతుంటే సమాధానం చెప్పలేక బిత్తరపోయినందుకా? ఈరోజు చెప్పిన మాట రేపు మర్చిపోతున్న ఈరోజులలో నీతి, నిజాయితీగల రాజకీయాలే చేస్తాను, నా ప్రాణం పోయినా సరే ఇచ్చిన మాట మీద నిలబడతాను అని చెప్పి దానిని ఆచరణలో పెట్టి చుపిస్తునందుకా? ఓడిపోతారని తెలిసిన ఇచ్చినా మాట కోసం వాళ్ళకే సీట్లు కేటాయించినందుకా? ప్రతిపక్షం అంటే ప్రతిది విమర్శించేది కాదు అని పాత సంప్రదాయాన్ని ఒక్క స్టేట్మెంట్ తో మార్చేసినందుకా?
 
ఆలోచించండి ఎవరికీ గర్వం ఉందొ? జగన్ పైన బురద జల్లడానికి అనుకూల మీడియా చేత పచ్చ నాయకులు చేపిస్తున్నవి నమ్మకుండా విజ్ఞతతో అలోచించి ఎవరు ప్రజల కోసం ఆలోచిస్తున్నారో, ఎవరు స్వార్ధ రాజకీయాలు చేస్తున్నారో గమనించండి.

షేర్ :

Comments

3 Comment

  1. Jai YS Jagan Anna

    Yes exactly people should think.especially common man should think first.

    Jai jagan

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.