వైర‌ల్ అవుతున్న జ‌గ‌న్ లేటెస్ట్ ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan ys
Updated:  2018-11-06 12:25:56

వైర‌ల్ అవుతున్న జ‌గ‌న్ లేటెస్ట్ ట్వీట్

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని శ్రీనివాస‌రావు అనే వ్య‌క్తి విశాఖ విమానాశ్ర‌యంలో గ‌త నెల 25వ తేదిన హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన సంగతి తెలిసిందే. దీంతో ఆయ‌న ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు ఆయ‌న‌కు చికిత్స చేసిన డాక్ట‌ర్ల కోరిక మేర‌కు విరామం ప్ర‌క‌టించారు.
 
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు త‌మ నాయ‌కుడు ఎప్పుడు కోలుకుంటారా ఎప్పుడు త‌మ ప్రాంతానికి వ‌స్తారా అని వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని వ‌రుస ట్వీట్లు చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
 
గాయం నుంచి నేను కోలుకుంటున్నాను. మీ అందరి తోడుగా, మీ ఆత్మీయతల మధ్య అతిత్వరలో తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తాను. ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలిగించాలన్నదే నా సంకల్పం, నా తపన. ప్రజల అభిమానం, దేవుడి ఆశీస్సులతో ఏడాది కాలంగా ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో నాకు మద్దతు పలికిన ప్రతి హృదయానికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను.
 

షేర్ :

Comments

0 Comment