జాతీయ పార్టీల నాయ‌కుల‌కు జ‌గ‌న్ లేఖ‌లు ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan image
Updated:  2018-03-13 12:16:17

జాతీయ పార్టీల నాయ‌కుల‌కు జ‌గ‌న్ లేఖ‌లు ?

ఓ ప‌క్క తెలుగుదేశం ఇత‌ర ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీల మ‌ద్ద‌తు తీసుకుంటాను  అవిశ్వాస తీర్మానం పెట్టండి అని చెప్పిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్, ఇప్పుడు ఏ మాత్రం దీనిపై స్పందించ‌డం లేదు. ఇక వైసీపీ మాత్రం అనుకున్న స‌మ‌యానికి ఈ నెల 21 న ప్ర‌త్యేక హూదా కోసం కేంద్రం పై  పోరాటం చేయ‌డానికి సిద్దం అవుతోంది. ఈ నెల 21 న అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని చెబుతున్నారు వైసీపీ నాయ‌కులు.
 
అవిశ్వాస తీర్మానం పై నోటీసు పార్ల‌మెంట్ లో ఇవ్వాలి అంటే  కనీసం 50 మంది ఎంపీలు దానికి మద్దతుగా సంతకాలు పెట్టాల్సి ఉంటుంది.. కాని వైసీపీ కి ఉంది మాత్రం కేవ‌లం ఐదుగురు ఎంపీలు మాత్రమే. ఇక మిగిలిన 
 45 మంది ఎంపీల మద్దతు కూడగట్టడం ఎలా..?. అనేది ఇప్పుడు వైసీపీ ఆలోచిస్తున్న పొలిటిక‌ల్ థాట్.
 
తీర్మానం ప్ర‌వేశ పెడ‌తామ‌ని చెప్పిన వైసీపీ ఇప్పుడు ఇంట‌ర్న‌ల్ గా ఈ విష‌యం గురించి ఆలోచిస్తోంది. ఇక అవిశ్వాసం ప్ర‌వేశ‌పెట్టండి వెంట‌నే ఒకే చేయ‌డానికి నేను అన్ని రాష్ట్రాలు తిరిగి మ‌ద్ద‌తు తీసుకుంటా అని చెప్పారు ప‌వ‌న్ ..ఆ సీన్  ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. అయితే ప‌వ‌న్ తెర వెనుక మ‌ద్ద‌తు కూడ‌గడుతున్నారేమో చూద్దాం అని అంటున్నారు వైసీపీ నాయ‌కులు... ఆయ‌న దీనిపై ఎటువంటి ఆలోచ‌న‌లో ఉన్నారో ఇప్ప‌టి వ‌ర‌కూ చ‌ర్చించ‌లేదు అని వైసీపీ కూడా ఆలోచిస్తోంది.
 
సొంతంగా ఎంపీల మద్దతు కూడగట్టేందుకు పార్లమెంట్‌లోని వివిధ పార్టీల మద్దతు కోరుతూ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డితో లేఖలు రాయించి వాటిని అందించాలని  వైసీపీ భావిస్తోంది. ఆ విధంగా అవిశ్వాసంపై మద్దతు కూడగట్టాలని యోచిస్తున్నారు వైయ‌స్సార్ కాంగ్రెస్ నాయ‌కులు. మొత్తానికి మ‌రో వారంలో  ఈ తీర్మానంపై స్ప‌ష్ట‌మైన వైఖ‌రి ఏమిటో తేల‌నుంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.