జ‌గ‌న్ వైసీపీ ఎమ్మెల్యేల‌తో కీల‌క భేటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan meeting
Updated:  2018-09-05 02:15:06

జ‌గ‌న్ వైసీపీ ఎమ్మెల్యేల‌తో కీల‌క భేటీ

రేపు ఏపీ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేసేందుకు సిద్ద‌మ‌య్యారు. అందులో భాగంగానే ఈ రోజు సాయంత్రం అందుబాటులో ఉన్న నేత‌ల‌తో జ‌గ‌న్ భేటీ కానున్నారు.  
 
ఆ త‌ర్వాత రేప‌టి అసెంబ్లీ స‌మావేశాల‌కు సంబంధించి పార్టీ నిర్ణ‌యాన్ని నేత‌లతో వెల్ల‌డించ‌బోతున్నారు. ఈ స‌మావేశంలో జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.
 
2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి కొద్ది రోజుల క్రితం అధికార ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకుని క్యాబినెట్ లో మంత్రి ప‌ద‌వుల‌ను అనుభ‌విస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకుంటే తాము అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రు అవుతామ‌నే నిర్ణయం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.