దర్శి అభ్యర్థిని ప్రకటించిన వైయ‌స్‌ జగన్‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan mohan reddy darshi ysrcp
Updated:  2018-03-03 06:38:02

దర్శి అభ్యర్థిని ప్రకటించిన వైయ‌స్‌ జగన్‌

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.. ప్ర‌కాశం జిల్లా పాద‌యాత్ర‌లో ఇప్ప‌టికే ప‌లు సెగ్మెంట్ల‌లో పాద‌యాత్ర స‌మ‌యంలో పార్టీ అభ్య‌ర్దులను జ‌గ‌న్ ప్ర‌క‌టిస్తున్నారు.. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్దులు వీరే అని త‌మ పార్టీ త‌ర‌పున అభ్య‌ర్దుల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేస్తున్నారు వైయ‌స్ జ‌గ‌న్.
 
తాజాగా ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్దిని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు..  దర్శి అభ్యర్థిగా మాధవ్‌ పేరును ఆయన వెల్ల‌డించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తాళ్లూరు బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ఈ మేరకు ప్రకటన చేశారు. మాధవ్  ను అందరూ ఆదరించాలని వైఎస్‌ జగన్‌ ప్రజలను కోరారు. ప్రజాసంకల్పయాత్ర 102వ రోజు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో కొనసాగింది.  తాళ్లూరు  ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక ద‌ర్శి సెగ్మెంట్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు పోటీ చేస్తారు అని  ఎంతో  సందిగ్ద‌త ఏర్ప‌డింది.. చివ‌ర‌కు జ‌గ‌న్ ఈ రోజు మాధ‌వ్  పేరును ప్ర‌క‌టించి, ఈ పోటీలో ఎవ‌రు పోటీ అనేది తెలియ‌చేశారు.
 
బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ను అని, ద‌ర్శి నుంచి వేరే వారికి అవ‌కాశం ఇవ్వాలి అని ఇప్ప‌టికే తెలియ‌చేశారు.. చివ‌ర‌కు జ‌గ‌న్ గ‌తంలో మాధ‌వ్ ని  ఇంచార్జ్ గా అక్క‌డ ప్ర‌క‌టించారు.. చివ‌రకు ఈరోజు మాధ‌వ రెడ్డి పేరును జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌డంతో ఇప్పుడు బూచేప‌ల్లి ద‌ర్శి నుంచి పోటికి  నిల‌బ‌డ‌రు అని తేలిపోయింది. అయితే ఇటు పార్టీలో ఇరువురు క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాలి అని జ‌గ‌న్ తెలియ‌చేశారు... అయితే ఇటు పాద‌యాత్ర‌లో బూచేప‌ల్లి కుటుంబం కూడా జ‌గ‌న్ వెంటే ఉన్న విష‌యం తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.