అదిరిన జ‌గ‌న్ స్పీచ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-21 10:49:22

అదిరిన జ‌గ‌న్ స్పీచ్

ప్రకాశం జిల్లాలో కొన‌సాగుతున్న  జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప‌యాత్రకు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.. వైయ‌స్సార్ సీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌కు విశేష జ‌న‌వాహిని క‌నిపిస్తోంది. ప్ర‌కాశంజిల్లాలో ప్ర‌జా సంక‌ల్ప‌యాత్రలో ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రైతుల‌కు వ‌రాలు ప్ర‌క‌టించారు.
 
త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, రాష్ట్రంలో  రైతన్నలను అన్నివిధాలుగా ఆదుకుంటాం అన్నారు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. స‌న్న చిన్న‌కారు రైతుల‌కు వ‌డ్డీ లేని రుణాలతో పాటు, పెట్టుబడి ప్రోత్సాహక నగదును కూడా అందజేస్తాం అని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు. 
 
పొన్నలూరు మండలం మాలపాడు సమీపంలో నిర్వహించిన రైతు సదస్సులో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల్గొన్నారు.... రైతులు పంటలు పండించేందుకు ప్రోత్సాహం అందిస్తామ‌ని. అలాగే పంట ఉత్పత్తుల ధరలను ముందుగానే ప్రకటించి అమలు చేస్తామ‌ని. దీనికోసం రూ.3వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం అన్నారు జ‌గ‌న్. పగటిపూట 9 గంటలపాటు ఉచిత విద్యుత్‌ ఇవ్వటంతోపాటు మే నెలలో ప్రతి రైతుకీ రూ. 12,500 చొప్పున పెట్టుబడి కింద అందజేస్తాం అని తెలియ‌చేశారు వైయ‌స్ జ‌గ‌న్.
 
బోర్ల కోసం లక్షల్లో ఖర్చుచేసి రైతులు అప్పులపాలవుతున్నారని ఆ ఇబ్బంది లేకుండా, తాము అండ‌గా ఉంటామ‌ని ఆ బాధ్య‌త‌ను తామే తీసుకుంటాం అని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేవరకు లాభాలలో ఉన్న ప్రకాశం జిల్లా సహకార డెయిరీ, ఈ నాలుగేళ్లలో 80 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిందని జగన్‌ విమర్శించారు. తాము ప్రభుత్వంలోకి రాగానే, సహకార డెయిరీకి పాలుపోసే పాడి రైతులకు లీటరుకు రూ.4ను ప్రోత్సాహంగా అందిస్తామని చెప్పారు మొత్తానికి జ‌గన్ ఇచ్చిన హామీల‌కు తెలుగుదేశం పార్టీ ఒక్క‌సారిగా కంగుతింటోంది.. అధికారంలో ఉండి కూడా ఎటువంటి హామీలు నెర‌వేర్చ‌ని స‌ర్కారుగా ప్ర‌జలు తెలుగుదేశం పై గుర్రుగా ఉన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.