వైసీపీకి వారే ఈసారి కీల‌కం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-09 14:47:37

వైసీపీకి వారే ఈసారి కీల‌కం

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం
 
1.. రైతు రుణ‌మాఫీ 
 
2.. కాపురిజ‌ర్వేష‌న్లు
 
3.. కేసులు అనే మ‌ర‌క‌లు 
 
ఇక చంద్ర‌బాబు సీనియ‌ర్ అని మోడీ మ‌న‌కు అండ‌గా ఉన్నాడ‌ని ప‌వ‌న్ కూడా ప‌క్క‌నే ఉన్నాడు కాబ‌ట్టి,, అంద‌రూ క‌లిసి  వ‌న్ సైడ్ తెలుగుదేశానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించేస‌రికి,  విజ‌యం వ‌రించింది.. ఇక 40 ఏళ్ల సీనియార్టీ అంటారు బాబు ఆ విష‌యం  ప‌క్క‌న పెడితే.. వెస్ట్ బెంగాల్  సీఎం మ‌మ‌తా  కేంద్రంతో కోట్లాడి తన రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప‌థ‌కాలు అమ‌లు చేయించుకుంటోంది... అందులో అనువంతైనా మ‌న వారు సాధించింది లేదు.. ఎవ‌రుఏమి అనుకుంటే నాకేంటి నా ప‌రిపాల‌న నాది అని చేస్తుంది మ‌మ‌తా, అందుకే ప్ర‌జాభిమానం ఆమెకు మెండుగా  ఉంది.. ఆమె డేరింగ్ కాబ‌ట్టే మోడీ కూడా వెస్ట్ బెంగాల్ జోలికి వెళ్లరు..కాని ఇక్క‌డ వారంద‌రి కంటే సీనియ‌ర్ అనిచెప్పుకునే చంద్ర‌బాబు మోదీని ఢీ కొట్ట‌లేక‌పోతున్నారు అనే విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు.
 
జ‌గ‌న్ బీజేపీ చీక‌టి ఒప్పందం అని చెప్పే తెలుగుదేశం... ఏ నాడైనా ఆ సాక్ష్యాల‌ను రుజువు చేసే ప్ర‌య‌త్నం మ‌చ్చుకు కూడాచేయ‌లేదు... ఇక వైసీపీ పై రావ‌ణాస్త్రాలు వేస్తూనే ఉంటున్నారు. ఇక ఏమాటాకి ఆ మాట బీసీ ఓటు బ్యాంకు మాత్రం ఈసారి జ‌గ‌న్ కి వ‌స్తుంది టీడీపీకి వ‌స్తుంది అని చెప్ప‌డానికి లేదు... ఇక్క‌డ జ‌గ‌న్ కూడా కాపుల విష‌యంలో ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌డం లేదు, ఎన్నిక‌ల ముందు ఇలాంటి ప్ర‌క‌ట‌న చేస్తే అంద‌రూ జ‌న‌సేన వైపు ప‌రుగులుపెట్టే ఆస్కారం ఉంది.. పైగా కాపు అయిన జ‌న‌సేనాని కుల ప్రీతి చూప‌కుండా రాజ‌కీయ ప్రీతి చూపుతున్నారు.
 
ఇక ఇక్క‌డ జ‌గ‌న్ రెండంచెల వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నారు.గ‌త ఎన్నిక‌ల్లో 18 శాతం టీడీపీ కంటే ఎక్కువ‌గానే వైసీపీ కాపుల‌కు టిక్కెట్లు ఇచ్చింది ..ఇది గుర్తించ‌లేదు ప్ర‌జ‌లు.. ముఖ్యంగా అంద‌రూ కాంగ్రెస్ జంపింగ్ ఎమ్మెల్యేలు కాబ‌ట్టి, టీడీపీ కాపు నాయ‌కుల పై ప్ర‌జల్లో ఓ పాజిటీవ్ వేవ్స్  వ‌చ్చాయి.
 
ఇప్పుడు మాత్రం కాపుల్లో చీల‌క ఇరు పార్టీల్లో వ‌స్తోంది.. సీమ‌లో అటూ రెడ్డే ఇటూ రెడ్డే కాబ‌ట్టి ఇరు పార్టీల త‌ర‌పున ఎవ‌రు ఉన్నా వారే ఉంటారు...సీమ రాజ‌కీయంలో అది ఓ బ్రాండ్ ...ఇప్పుడు ఉత్త‌ర‌కోస్తా ద‌క్షిణ‌కోస్తా రాజ‌కీయం కూడా మారిపోతోంంది..కాపులు బ‌ల‌మైన నాయ‌కులు ఎవ‌రు?  వారికి  సీటు ఇస్తే వచ్చే ఎన్నిక‌ల్లో గెలుపు వ‌స్తుందా? అస‌లు గెలుపు గుర్ర‌మేనా, అనేది ఇరు పార్టీలు ఆలోచిస్తున్న అంశం.
 
అందుకే ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ విష‌యం ఎలా ఉన్నా, ఉత్త‌ర‌కోస్తాలో ద‌క్షిణ కోస్తాలో కాపుల విష‌యంలో రెండంచెల వ్యూహాం వేస్తున్నారు...చాలా సెగ్మెంట్ల‌లో  ఒకేసామాజిక‌వ‌ర్గానికి చెందిన నాయ‌కులు ఇరువురు సీట్లు కావాల‌ని కోరుకుంటున్న విష‌యం తెలిసిందే.. ఇక టీడీపీలో కూడా ఇక్క‌డ సిట్టింగుల‌కు సీట్లు ఇస్తే గెలుపు క‌ష్టం ముఖ్యంగా ఇసుక మాటే గుర్తు వ‌స్తోంది ద‌క్ష‌ణి కోస్తా రాజ‌కీయాల్లో.. అందుకే ఇక్క‌డ 18 మంది కాపుల‌కు సీట్లు ఇస్తే ఎలా ఉంటుంది అనేది వైసీపీ ఆలోచ‌న... ఇప్ప‌టికే సిట్టింగ్ ఇంచార్జ్ ల‌కు కూడా ఆదేశాలు ఇంట‌ర్న‌ల్ గా వెళ్లాయి అట‌..గ‌తంలో కాపుల‌కు ఎన్ని సీట్లు జ‌గ‌న్ ఇచ్చారో ఈసారి కూడా ఆ లెక్క అలానే ఉండ‌బోతోంద‌ని ఎక‌క‌డా లెక్క‌లు మార‌వు అని అంటున్నారు.. వారే ప్చూచ‌ర్ అని పార్టీ ప్ర‌గాడ విశ్వాసం చూపుతోంద‌ట‌.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.