జ‌గ‌న్ స‌రికొత్త హామీకు ఫిదా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan
Updated:  2018-09-22 17:53:31

జ‌గ‌న్ స‌రికొత్త హామీకు ఫిదా

ప్ర‌తిపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్రకు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా బ్రహ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఈ సంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ నాయ‌కులు కంచుకోట విశాఖ ప‌ట్నం జిల్లాలో దిగ్విజ‌యంగా కొన‌సాగుతుంది. ఇప్ప‌టికే ఈ పాద‌యాత్ర రాయ‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌ను అలాగే కోస్తాలోని ఆరు జిల్లాల‌ను పూర్తిచేసుకుంది.
 
అడుగ‌డుగున ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌రత్నాల‌ను ప్ర‌జ‌లు వివ‌రిస్తూ పాద‌యాత్ర‌లో ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్. ఇక‌ పాద‌యాత్ర‌లో భాగంగా వ‌ర్కింగ్ జర్న‌లిస్ట్ యూనియ‌న్ ప్ర‌తినిధులు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లుసుకున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా వారు జ‌ర్న‌లిస్ట్ లు త‌మ స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. తాము ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన త‌ర్వాత రాష్ట్ర‌ వ్యాప్తంగా ఉన్న ప్ర‌తీ జ‌ర్న‌లిస్ట్ కు నెల‌కు 10 వేల రూపాయ‌ల‌ను పెన్ష‌న్ రూపంలో ఇవ్వాల‌ని వారు కోరారు. అలాగే జ‌ర్న‌లిస్ట్ లు అకాల మ‌ర‌ణం చెందితే వారి కుటుంబ స‌భ్యుల‌కు, లేక‌ వారి భార్య‌కు 5 వెలు రూపాయ‌ల‌ను ప్ర‌క‌టించార‌ల‌ని జ‌గ‌న్ కు విజ్ఞ‌ప్తి చేశారు. 
 
ఇక వారి స‌మ‌స్య‌ల‌ను విన్న జ‌గ‌న్ 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్ర‌తీ జ‌ర్న‌లిస్ట్ ల‌కు ప‌క్కా ఇళ్ల స్థ‌లాల‌ను కేటాయిస్తామ‌ని హామీ ఇచ్చారు. అంతేకాదు జ‌ర్న‌లిస్ట్ లు స‌మ‌స్య‌ల‌పై పూర్తిగా అధ్య‌య‌నం చేసి పెన్ష‌న్ పై త‌గిన నిర్ణ‌యాలు తీసుకుంటామ‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.