ఆ డెసిష‌న్ తీసుకోనంటున్న జ‌గ‌న్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-30 13:09:10

ఆ డెసిష‌న్ తీసుకోనంటున్న జ‌గ‌న్ ?

2014 ఎన్నిక‌ల్లో ముందు బీజేపీ జ‌గ‌న్ తో మంత‌నాలు జ‌రిపింది..  జ‌గ‌న్ తో క‌లిసి పోటీ చేయాలి అని అనుకున్నారు.. దీనికి  కార‌ణాలు తెలిసిందే... చంద్ర‌బాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని హైద‌రాబాద్ లో అడుగుపెడితే  అరెస్ట్ చేస్తా అన్నారు... అలాగే మ‌రోసారి మ‌త‌త‌త్వ పార్టీతో  క‌లిసే ప్ర‌స‌క్తేలేదు అని, బీజేపీతో జ‌న్మ‌లో పోత్తుపెట్టుకోను అన్నాడు...
 
ఇవ‌న్నీ బీజేపీ పుస్త‌కాల్లో చెర‌గని అక్ష‌రాల్లా  రాసి ఉన్నాయి.. అయితే సీనియ‌ర్లు చంద్ర‌బాబుతో పొత్తు వ‌ద్ద‌న్నా అమిత్ షా ముందుకు వ‌చ్చి వెంక‌య్య‌తో ఈ డీల్ కుదిర్చారు అని అంటారు... అయితే జ‌గ‌న్ ఓట‌మికి బీజేపీ తెలుగుదేశం జ‌ట్టు ప్ర‌ధాన కార‌ణం అయితే , చంద్ర‌బాబు ఇచ్చిన  666 హామీలు కాపుల రిజ‌ర్వేష‌న్ మొద‌లైన‌వి వైసీపీ ఓట‌మికి కార‌ణం అయ్యాయి.. ఇక ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాత చంద్ర‌బాబు వీటిని బంగాళాఖాతంలో క‌లిపేశారు.
 
అయితే ఇప్పుడు వినిపిస్తున్న కొత్త వార్త ఏమిటి అంటే, వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పొలిటిక‌ల్ స్టెప్ మార్చ‌బోతున్నార‌ట‌.. ఇది నిజ‌మా అని ఏపీ అంతా వైర‌ల్ అవుతోంది... అయితే ఇదేమీ వైసీపీ నాయ‌కులు తెలియ‌చేస్తున్న విష‌యం కాదు. కేవ‌లం తెలుగుదేశం గెజెట్ ప‌త్రిక‌లు అధికార ఛానెళ్లు చేస్తున్న‌విష ప్ర‌చారం మాత్ర‌మే... మా రాజ‌కీయం త‌ట్టుకోలేక బీజేపీ వెన‌క్కివెళ్లి పోయింది, ఇక బీజేపీ మ‌న ఏపీకి ఇంత అన్యాయం ,చేస్తే జ‌గ‌న్ బీజేపీతో క‌ల‌వడానికి రెడీ అవుతున్నారు అని ప్ర‌చారం చేస్తున్నారు తెలుగుదేశం నాయ‌కులు. జ‌గ‌న్ బీజేపీ క‌లిసి పోయారు అని ఎక్క‌డ‌లేని అక్క‌సును చూపిస్తున్నారు తెలుగుదేశం నాయ‌కులు.
 
మొత్తానికి తెలుగుదేశం పార్టీ చేస్తున్న విష‌ప్ర‌చారం పై జ‌గ‌న్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు... ఏపీకి ఎవ‌రైతే ప్ర‌త్యేక హూదా ఇస్తారో వారితో జ‌త‌క‌డ‌తాం, వారికి స‌పోర్ట్  చేస్తాం అన్నారు.. అదే విధంగా జ‌గ‌న్ ముందుకు వెళుతున్నారు. చంద్ర‌బాబు లా జ‌గ‌న్ కు రాజ‌కీయాలు చేత‌కాదు అంటున్నారు వైసీపీ నాయ‌కులు.. ప్ర‌త్యేకహూదా ఏమైనా సంజీవ‌నా అని చెప్పిన చంద్ర‌బాబు,  ఇప్పుడు మాట‌మార్చి మ‌ళ్లీ ప్ర‌త్యేకహూదా కావాలి అని కోరుతున్నారు.. జ‌గ‌న్ మాత్రం బీజేపీతో క‌లిసే ప్ర‌స‌క్తేలేదు అంటున్నారు వైసీపీ నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.