కన్నాకు జ‌గ‌న్ ఆఫ‌ర్ అదిరింది ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

kanna lakshmi narayana image
Updated:  2018-03-12 11:18:48

కన్నాకు జ‌గ‌న్ ఆఫ‌ర్ అదిరింది ?

క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగువెలిగిన క్రియాశీల‌క నాయ‌కుడు మాజీ మంత్రిగా సుప‌రిచితుడు.. గుంటూరులో రాజ‌కీయంగా  చక్రం తిప్పిన కీల‌క నేత, అలాంటి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ రాజ‌కీయం ప్ర‌స్తుతం డైల‌మాలో ఉంది. 
 
క‌న్నాకు గుంటూరు జిల్లాలో పెద‌కూర‌పాడు కంచుకోట‌గా చెప్పుకోవాలి... కాని 2009 ఎన్నిక‌ల్లో ప‌లు ఈక్వేష‌న్ల‌లో భాగంగా గుంటూరు వెస్ట్ ప‌శ్చిమ నుంచి పోటీ చేశారు  మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌.. అయితే ఇది చాలా త‌క్కువ మెజార్టీతో వ‌చ్చిన విజ‌యం అనే చెప్పాలి....  2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌పున ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు.. 
 
ఏపీలో కాంగ్రెస్ పార్టీ మ‌రుగున ప‌డిపోవ‌డంతో, నాయ‌క‌త్వం కూడా లేక‌పోవ‌డంతో ఇటు బీజేపీలో చేరారు క‌న్నా... ఇక సీనియ‌ర్ నేత మాజీ కేంద్ర మంత్రి కావూరిసాంబ‌శివ‌రావు డెసిష‌న్ తో ఆయ‌న బీజేపీలో చేరారు... హ‌స్తిన‌లో కూడా ఆయ‌న‌కు అనేక హామీలు వ‌చ్చాయి అంటారు.... అయితే స్టేట్ బీజేపీలో ఎవ‌రికి వారే య‌మునా తీరే  అనే చందంగా ఉన్నారు.. ఎవ‌రికి వారు త‌మ స్ట్రాట‌జీల‌తో వెళుతున్నారు. ఉన్నా ఇద్ద‌రు బీజేపీ మంత్రులు బీజేపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పార్టీ ప‌రిస్ధితి పై స‌మీక్షించింది లేదు అంటారు.. ఇటు పురందేశ్వ‌రి - కన్నా పార్టీలో అధ్య‌క్ష పీఠం పొందుతారు అని అనుకున్నారు అది కూడా జ‌రుగ‌లేదు చివ‌ర‌కు.
 
బీజేపీ లో ఆయ‌న ఈక్వేష‌న్లు ఫార్మూలాలు పనిచేయ‌డం లేదు. ఇక ఆయన వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అనే వార్త‌లు గ‌త కొద్ది కాలంగా వినిపిస్తున్నాయి... గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మితో ఆయ‌న ఇంకా ఆలోచ‌న‌లో ఉన్నారు. అందుకే వచ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎలాగైనా విజ‌యం సాధించాలి అని అనుకుంటున్నారు. అందులో భాగంగా ఆయ‌న‌కు వైసీపీ నాయ‌క‌త్వం కూడా పిలుపునిస్తోంది.
 
ముఖ్యంగా గుంటూరు జిల్లా నుంచి వైసీపీ త‌ర‌పున అంబ‌టి రాంబాబు అలాగే మ‌రో ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు జిల్లాలో ఆయ‌న రాక‌కై పిలుపు ఇచ్చారు అని తెలుస్తోంది. ఆయ‌న‌కు జ‌గ‌న్ పెద‌కూర‌పాడు లేదా గుంటూరు వెస్ట్ సీటు ఇవ్వ‌డానికి సుముఖ‌త చూపారు అని తెలుస్తోంది. కాని ఆయ‌న 10 ఏళ్ల నుంచి పెద‌కూర‌పాడు సెగ్మెంట్ ను వ‌దిలేశారు దీంతో ఆయ‌న గుంటూరు వెస్ట్ ను ఎంచుకున్నారు.
 
ఇక ఆ సెగ్మెంట్ పైనే ఫోక‌స్ చేసి అక్క‌డ నుంచి వ‌చ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే గుంటూరు వెస్ట్ నుంచి ఆయ‌న‌కు విజ‌యం వ‌స్తుంది అంటున్నారు.. ఇక్క‌డ సామాజిక అంశాలు వ‌ర్గాలు ఈక్వేష‌న్లు చూసుకున్నా ఆయ‌న‌కు కేడ‌ర్ కూడా బ‌లంగా ఉంది. మ‌రి ఆయ‌న త‌నకు నాలుగు సార్లు విజయం ఇచ్చిన పెద‌కూర‌పాడును ఎంచుకుంటారో, లేదా  గుంటూరు వెస్ట్ నుంచి రంగంలోకి దిగుతారా అనేది ఆయ‌న డెసిష‌న్.. అయితే జ‌గ‌న్ పాద‌యాత్ర స‌మ‌యంలో పార్టీలో చేరినా ఆశ్య‌ర్య‌పోవ‌క్క‌ర్లేదు అంటున్నారు జిల్లా నాయ‌కులు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.