స‌రికొత్త వ‌రాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-08 18:35:44

స‌రికొత్త వ‌రాలు

కృష్ణాజిల్లా గుడివాడ‌లో పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్ ప‌లువరాలు ఇస్తూ ముందుకు వెళుతున్నారు.. త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకోవ‌డానికి వ‌స్తున్న‌వారితో చ‌ర్చించి వారికి భ‌రోసా క‌ల్పిస్తున్నారు జ‌గ‌న్..నాయి బ్రాహ్మణులకు చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పిస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  తాజాగా హామీయిచ్చారు...తాము అధికారంలోకి వచ్చాక నాయి బ్రాహ్మణులకు అన్ని విధాల మేలు చేస్తామన్నారు ఆయ‌న‌.
 
అస‌లు స‌మాజంలో నాయి బ్రాహ్మ‌ణులు లేక‌పోతే నాగ‌రిక‌త ముందుకు సాగ‌లేదు.. కాని నేడు వీరు బతకలేని పరిస్థితి ఉంది అని అన్నారు... ముఖ్యంగా  చిన్న కులం కావడంతో రాజకీయంగా ఎవరూ పట్టించుకోలేదు. క్షౌరశాలల్లో ఫ్యాన్‌లు, టూబ్‌లైట్లకు రూ. 8 నుంచి రూ. 14 వరకు కరెంట్‌ చార్జీలు వసూలు చేస్తున్నారు  స‌ర్కారు నుంచి .... కనీసం 4 వేల రూపాయలు కరెంట్‌ బిల్లు కట్టాలంటే ఎలా బతకాలని వాపోతున్నారు. సెలూన్‌లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తాం. 500 యూనిట్ల వరకు డొమెస్టిక్‌ టారీఫ్‌ ఉండేలా చూస్తాం.
 
ప్రతి షాపుకు రూ. 10 వేలు ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధం లేదా 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ రెండింటిలో ఒకటి అందిస్తాం. నాయి బ్రాహ్మణ ఫెడరేషన్‌ బదులుగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రుణాలు ఇప్పిస్తాం.అని జ‌గ‌న్ హామీ ఇచ్చారు ఇక ఎన్నో ఏళ్లుగా వార‌స‌త్వంగా వ‌స్తున్న‌ప‌నులు చేస్తున్నాము అని వారు తెలియ‌చేశారు జ‌గ‌న్ కు అయినా స‌ర్కారు నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేదు అని అన్నారు ఆ స‌భ్యులు.
 
అలాగే రాష్ట్రంలో చాలా దేవాల‌యాల్లో నాయి బ్రాహ్మ‌ణులు ప‌నిచేస్తున్నార‌ని వాయిద్య క‌ళాకారులుగా దేవుకిని సేవ‌లు చేస్తున్నారు అని వారికి స‌రైన సౌక‌ర్యాలు లేవ‌ని వారిని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, వారికి కూడా ఉద్యోగ భ‌ద్ర‌త స‌రైన సౌక‌ర్యాలు క‌ల్పిస్తాము అని తెలియ‌చేశారు జ‌గ‌న్ వెనుక బ‌డిన కులాల వారికి క‌చ్చితంగా చ‌ట్ట‌స‌భ‌ల్లో ప్రాధాన్య‌త క‌ల్పిస్తాము అని తెలియ‌చేశారు జ‌గ‌న్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.