వారిద్ద‌రిని బొక్కలో పెడ‌తాం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-08 16:11:27

వారిద్ద‌రిని బొక్కలో పెడ‌తాం

ప్రతిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా  కృష్ణా జిల్లా గుడివాడ‌లో బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేశారు... ఈ బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ మాట్లాడుతూ... ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు విచ్చ‌లవిడిగా అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు... రాజ‌ధాని భూముల నుంచి మ‌ట్టి వ‌ర‌కూ అక్ర‌మంగా దోచుకుంటున్నార‌ని జ‌గ‌న్ ఆరోపించారు.
 
ఇక దీంతో పాటు మూడు ల‌క్ష‌ల విలువైన ఫ్లాట్ల‌ను పేద‌వాడికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆరు ల‌క్ష‌ల‌కు అమ్ముతున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు... ఇందులో కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌గం కేటాయిస్తే మిగిలిన మూడు ల‌క్ష‌లు పేద‌వాడి పేరు మీద మూడు ల‌క్ష‌లు అప్పుగా రాసుకుంటున్నార‌ని నిప్పులు చెరిగారు... అధికారం అండ‌తో ఇంత అవినీతికి పాల్ప‌డుతున్న చంద్ర‌బాబును తీసుకుని వెళ్లి హిమాల‌యాల్లో తోసేయ్యాల‌ని జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు.
 
అలాగే 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు నాయుడు సుమారు ఆరు వంద‌ల‌కు పైగా త‌ప్పుడు హామీల‌ను ప్రక‌టించి అధికారంలోకి వ‌చ్చార‌ని, అయితే రాష్ట్రంలో ఒక్క‌గ్రామం అయినా అభివృద్ది చేశారా అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు... అయితే ఇప్పుడు సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో గుడివాడ ప్రాంత ప్ర‌జ‌ల‌కు అక్ర‌మంగా దోచుకున్న ఫ్లాట్ల‌ల‌ను మ‌ళ్లీ తిరిగి వారికి మూడు ల‌క్ష‌ల‌కు ఇస్తార‌ని ఆరోపించారు.
 
అయితే చంద్ర‌బాబు ఇచ్చిన ఇల్లును తీసుకోండ‌ని  జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు సూచించారు....మీ పేరు మీద ఉన్న ఆ రూ.3 లక్షల అప్పు నేను తీసుకుంటాన‌ని మనందరి ప్రభుత్వం రాగానే మీరు ఆ అప్పు కట్టాల్సిన అవసరం లేకుండా చేస్తానని జ‌గ‌న్ హామీ ఇచ్చారు...  అలాగే కుంభ‌కోణాల‌కు పాల్ప‌డుత‌న్న చంద్ర‌బాబు, ఆయ‌న  ఆ కాంట్రాక్టర్‌ ఇద్దరినీ ఎక్కడ బొక్కలో పెట్టాలో అక్కడ పెడతాం అంటూ జ‌గ‌న్ వ్యాఖ్య‌లు చేశారు.
 
ఇక దీంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ప్ర‌తీ ఇంటికి ఒక మ‌నిషిని పంపించి ఇంటికి ఒక బెంజికారు కిలో బంగారం, మూడు వేలు ఇస్తామ‌ని చంద్ర‌బాబు వారికి చెప్పి పంపిస్తార‌ని తెలిపారు... అయితే చంద్ర‌బాబు పంపించినవ‌న్ని కాద‌న‌కుండా తీసుకోవాల‌ని, మూడు వేలు ఓటుకు ఇవ్వ‌డానికి వ‌స్తే  మూడు కాదు ఐదు వేలు కావాల‌ని అడ‌గండ‌ని జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు సూచించారు.. చంద్ర‌బాబు ఇచ్చే డ‌బ్బంతా మ‌న‌దే అని కానీ, ఓటు మాత్రం మ‌న‌స్సాక్షి చెప్పిన వారికి ఓటు వెయ్యాల‌ని జ‌గ‌న్ తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.