పశ్చిమ లో జగన్‌ పాదయాత్ర

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-10 16:15:49

పశ్చిమ లో జగన్‌ పాదయాత్ర

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం కృష్ణాజిల్లాలో కొన‌సాగుతోంది. ఇటు కృష్ణా త‌ర్వాత ఆయ‌న పాద‌యాత్ర ప‌శ్చిమగోదావ‌రి జిల్లాలో జ‌రుగ‌నుంది అనేది తెలిసిందే. ఇప్ప‌టికే ప‌శ్చిమ‌లో వైసీపీ కేడ‌ర్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కోసం రెడీ అయింది.
 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 13 న పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించబోతోంద‌ని వైసీపీ నాయ‌కులు తెలియ‌చేశారు. జ‌గన్ కు స్వాగ‌తం ప‌లికేందుకు జిల్లా వైసీపీ శ్రేణులు సిద్దం అయ్యారు.. ఎమ్మెల్సీ, జిల్లా అధ్య‌క్షుడు, జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహిత వ్య‌క్తి ఆళ్లనాని, పార్టీ నాయ‌కులు త‌ల‌శిల‌ రఘురాం, కోటగిరి శ్రీధర్‌లు తాజాగా జ‌గ‌న్ పాద‌యాత్ర గురించి మీడియా  సమావేశం ఏర్పాటు చేశారు.
 
పశ్చిమ గోదావరి జిల్లాలో 13 నియోజకవర్గాల్లో 250 కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉంటుందని తెలిపారు. 14వ తేదీన ఏలూరు సమీపంలోని మదేపల్లి వద్ద వైఎస్‌ జగన్‌ పాదయాత్ర 2 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంటుందని వెల్లడించారు జిల్లా నాయ‌కులు.
 
ఈ సందర్భంగా 40 అడుగుల పైలాన్‌ను జగన్‌ ఆవిష్కరిస్తారని  తెలియ‌చేశారు. అదేవిధంగా ఏలూరు పాత బస్టాండ్‌ (14 వతేది)న  జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర రూట్ మ్యాప్ ను ఎప్ప‌టిక‌ప్పుడు జిల్లా వైసీపీ కేడ‌ర్ కు తెలియ‌చేస్తామ‌ని తెలియ‌చేశారు నాని.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.