బాబుకు కొత్త పేరు పెట్టిన జ‌గ‌న్ ఆస్కార్ కు పంపాలి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan padayatra political comments  on chandrababu  naidu
Updated:  2018-03-13 11:07:18

బాబుకు కొత్త పేరు పెట్టిన జ‌గ‌న్ ఆస్కార్ కు పంపాలి

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర ప్ర‌కాశం జిల్లా నుంచి గుంటూరు జిల్లాలోకి ప్ర‌వేశించింది..జ‌గ‌న్ స్టూవర్టుపురం నుంచి బాపట్ల వరకు పాదయాత్ర నిర్వహించారు... ఇక బాబు కంచుకోట‌లో జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌వేశించేస‌రికి తెలుగుదేశం నాయ‌కులు కూడా ఊహించ‌ని విధంగా పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.
 
ఊసరవెల్లిలా రంగులు మార్చుతూ డ్రామాలు వేయడంలో దిట్టయిన సీఎం చంద్రబాబుకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ అన్నారు. ...చంద్రబాబు చేయగలిగిన పని కూడా చేయకుండా ప్రత్యేక హోదా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. విశ్వసనీయత, విలువలు, నిజాయితీలేని ఆయనకు ఉత్తమ విలన్‌గా ఆస్కార్‌ అవార్డు ఇవ్వాలి అని జ‌గ‌న్ విమ‌ర్శ‌లు చేశారు.
 
గ‌తంలో రాష్ట్ర విభజన జ‌రిగిన స‌మ‌యంలో ఏపీకి  ప్రత్యేక హోదా ఇవ్వాలని 2014 మార్చి 2న ప్రణాళిక సంఘానికి కేంద్రం లేఖ పంపింది. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దానిని పట్టించుకోలేదు. ఆ లేఖ ప్రణాళిక సంఘం వద్ద ఏడు నెలలు ఉంది.... ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిందని 14వ ఆర్థిక సంఘానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పి మోసగించారు అని ఆరోపించారు. కేవ‌లం స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం బాబు ప్ర‌త్యేక హూదాను తాక‌ట్టుపెట్టారు అని విమ‌ర్శించారు.
 
ప్రత్యేక హోదా విషయంలో సినిమా క్లైమాక్స్‌కు వచ్చిన తర్వాత కేంద్రంలో ఉన్న మంత్రులను ఉపసంహరించుకుని ఎన్డీఏలోనే కొనసాగుతామంటున్నారు. చంద్రబాబుకు సిగ్గులేదు. దమ్ముంటే పార్లమెంటు సమావేశాల చివరిరోజు ఏప్రిల్‌ 6న రాష్ట్ర ఎంపీలంతా రాజీనామా చేసేందుకు ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు..... వైసీపీ అధికారంలోకి వస్తే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేలు పెన్షన్‌ ఇస్తామని జగన్‌ ప్రకటించారు. గుంటూరు జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు మొద‌టిరోజు ప్ర‌జ‌ల పెద్ద ఎత్తున  పాల్గొన్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.