పాద‌యాత్రకు రూట్ క్లియ‌ర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-09 17:15:39

పాద‌యాత్రకు రూట్ క్లియ‌ర్

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో నిడ‌ద‌వోలు మీదుగా సాగుతోంది.. మ‌రో రెండు రోజుల్లో జ‌గ‌న్ తూర్పుగోదావ‌రి జిల్లాలోకి పాద‌యాత్రతో వెళ్ల‌నున్నారు..అయితే జ‌గ‌న్ పాద‌యాత్ర ముందు నుంచి అనుకున్న విధంగా ఓ క్ర‌మ‌బ‌ద్దంగా వెళుతోంది.. అయితే ఈ స‌మ‌యంలో ఓ వార్త ఇటు తూర్పుగోదావ‌రి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఆలోచ‌న‌లో ప‌డేసింది కేడ‌ర్‌ని.
 
జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌లు ఎలా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారో తెలిసిందే ..ఇక పార్టీ కార్య‌క‌ర్త‌లు అస‌లు ఆగుతారా, అవును నిజ‌మే జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో కార్య‌క‌ర్త‌లు, నేత‌లు, వంద‌లాదిగా వేలాదిగా క‌దం తొక్కుతున్నారు ఇంత మంది జ‌న‌సంద్రాన్ని చూసి అధికార పార్టీ కూడా ఆలోచ‌నలో ప‌డింది.
 
అయితే ఇప్పుడు జ‌గ‌న్ పాద‌యాత్ర తూర్పుగోదావ‌రి జిల్లాలో 12-06-2018 న రాజ‌మహేంద్ర‌వ‌రంలోకి ప్ర‌వేశించ‌నుంది.. అక్క‌డ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కమైన రోడ్ కం రైల్వే బ్రిడ్జ్ మీద నుంచి పాద‌యాత్ర కొన‌సాగ‌నుంది.. కాని ఆ బ్రిడ్జ్ నిర్మించి ఎన్నో ఏళ్లు అయిన కార‌ణంగా అక్క డ వేల సంఖ్య‌లో జ‌నం వంద‌ల సంఖ్య‌లో వాహానాలు ఒక్క‌సారిగా రావ‌డం అంత శ్రేయ‌స్క‌రం కాద‌ని,అందుకే ఆ బ్రిడ్జ్ పాద‌యాత్ర‌కు ప‌ర్మిష‌న్ కుద‌ర‌దు అని పోలీసులు తెలియ‌చేశారు.
 
ఈ రూటు కాకుండా వేరే రూటు ప్ర‌త్యామ్నాయంగా చూసుకోవాల‌ని తెలియ‌చేశారు  పోలీసులు అలాగే కోటి ప‌ల్లి బ‌స్డాండ్ సెంట‌ర్లో కూడా భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించేందుకు అనుమ‌తి నిరాక‌రించారు ఇక్క‌డ గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని స‌భ నిర్వ‌హించకూడ‌ద‌ని తెలియ‌చేశారు.
 
అయితే జిల్లా వైసీపీ నాయ‌కులు జిల్లా ఎస్పీని క‌లిసి చర్చించారు..కాని నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ఇక్క‌డ పాద‌యాత్ర కొన‌సాగిస్తాం అని తెలియ‌చేశారు జిల్లా ఎస్పీకి..దీంతో పాద‌యాత్రకు రోడ్ కం రైల్వేబ్రిడ్జ్ ద‌గ్గ‌ర నుంచి అనుమ‌తి ల‌భించింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.