ఓ వైపు జ‌గ‌న్ మ‌రో వైపు ప‌వన్....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan mohan reddy and pawan kalyan image
Updated:  2018-03-12 11:55:19

ఓ వైపు జ‌గ‌న్ మ‌రో వైపు ప‌వన్....

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినే వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ప్ర‌కాశం జిల్లాలో ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.. ముఖ్యంగా ప్ర‌తీసెగ్మెంట్లోనూ జ‌నం జ‌న‌జాత‌ర‌లా జ‌గ‌న్ కోసం వ‌స్తున్నారు. జ‌గ‌న్ అన‌ర్గ‌ళంగా తెలుగుదేశం ఎటువంటి మోస‌పూరిత హామీలు ఇచ్చింది అనేది తెలియ‌చేస్తున్నారు ప్ర‌జ‌ల్లో చైతన్యం తీసుకువ‌స్తున్నారు.. అయితే జ‌గ‌న్ ఇటీవ‌ల జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ను  కూడా కాస్త సెంట‌ర్ చేస్తున్నారు.. చంద్ర‌బాబు పార్ట్ న‌ర్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటూ ఛ‌లోక్తులు విసురుతున్నారు.
 
ఇక ఆయ‌న కూడా గుంటూరు జిల్లాలో ఈ నెల 14న ప్లీన‌రీ ఏర్పాటు చేయ‌నున్నారు. దీని కోసం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.. వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌కాశం నుంచి నేడు  బాపట్లలోకి ప్రవేశించ‌నుంది.
దీంతో ఇటు రెండు పార్టీల్లో కాస్త హుషారు ఉంది అనే చెప్పాలి.
 
గుంటూరు జిల్లాలో మూడు వారాల పాటు జ‌గ‌న్ పాద‌యాత్ర  కొనసాగనుంది...మొత్తం 12 నియోజకవర్గాలలో  జ‌గ‌న్ పాద‌యాత్ర కొనసాగుతుందని  పార్టీ నేతలు రావి వెంకటరమణ, లేళ్ళ అప్పిరెడ్డి తెలియ‌చేశారు. జిల్లాలో తొలి రోజు బాపట్ల నియోజకవర్గంలోని బేతపూడి, వెదుళ్ళపల్లి, వడ్డెరపాలెం, మహాత్మాజీపురంలలో పర్యటించి మధ్యాహ్నం భోజన విరామ సమయం త‌ర్వాత  బాపట్ల పట్టణానికి చేరుకుంటారు. పట్టణంలో బహిరంగ సభలో ప్రసంగించిన  అక్కడే రాత్రి బస చేస్తారు.
 
ఇక  అప్పికట్ల, ఏటేరు, చుండూరుపల్లి, పొన్నూరు నియోజకవర్గంలో ములుకుదురు, చింతలపూడి, పొన్నూరు, కసుపర్రు, వల్లభరావుపాలెం, లింగాయపాలెం, ప్రత్తిపాడు నియోజకవర్గంలో గరికపాడు, బీకే పాలెం, కాకుమాను, పెద్దివారిపాలెం, కొమ్మూరు, నాగులపాడు, పెదనందిపాడు, చిలకలూరిపేట నియోజకవర్గంలో పాలపర్రు, అన్నారం, ఉప్పలపాడు, మిట్టపాలెం, గొట్టిపాడు, దండమూడి, చిలకలూరిపేట ప్రాంతాల్లో ఈనెల 21వ తేదీ వరకు పాదయాత్ర షెడ్యూల్‌ను నేతలు ప్రకటించారు. 
 
ఇక జ‌న‌సేనాని కూడా ఇటు గుంటూరు జిల్లాలో ప్లీన‌రీ స్టార్ట్ చేయ‌డం, 14 వ తేదీన ప్లీన‌రీకి ప‌వ‌న్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున హాజ‌రుకానున్నారు.. మొత్తానికి ఇరు పార్టీల అధినేత‌లు ఒకే జిల్లాలో టూర్లు చేయ‌డం గుంటూరు జిల్లాలో రాజ‌కీయ హీట్ ను పెంచుతోంది.... మొత్తానికి పోలీసుల‌కు మాత్రం ఇది పెద్ద స‌వాల్ అంటున్నారు జిల్లా ప్ర‌జ‌లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.