జ‌గ‌న్ క‌రెక్ట్ ప్లాన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-24 14:46:20

జ‌గ‌న్ క‌రెక్ట్ ప్లాన్

రాష్ట్రంలో అంతా నాయిష్టం అని సీఎం చంద్ర‌బాబు త‌న పాల‌న‌తో వెళ్లిపోతుంటే... దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాకర్ కూడా దుందూకుడుగా వ్య‌వ‌హరిస్తూ ముందుకు వెళుతున్నారు... అయితే చేప‌ల చెరువుల విష‌యం నుంచి ఇసుక విష‌యంలో ఎమ్మార్వో వ‌న‌జాక్షి పై దాడితో ఆయ‌న మ‌రింత ఫేమ‌స్ అయ్యారు... వివాదాల మ‌నిషిగా ఆయ‌న పై విమ‌ర్శ‌లు వినిపిస్తూనే ఉన్నాయి..
 
ఇక అడ్డుఅదుపు లేకుండా మాట‌లతూటాలు పేలుస్తారు ఆయ‌న‌.... ఇక మాజీ మంత్రి వ‌సంత కుమార్ పై దాడికేసులో ఆయ‌న‌కు శిక్ష ప‌డినా డోంట్ కేర్ అంటూ వెళుతున్నారు.. అయితే సీఎం దీనిపై మాట్లాడాలి స‌ర్దిచెప్పాలి అని చెబుతున్నా అస‌లు చింత‌మ‌నేనికి ఫోన్ చేసి మంద‌లించింది లేదు అంటారు... అయితే సీనియ‌ర్ అని చింత‌మ‌నేని జోలికి వెళ్ల‌డం లేదా అంటే ఆయ‌న ఎంత సీనియ‌రో అంద‌రికి తెలిసిందే ....ఇక గ‌తంలో మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని అల‌క బూని రాజీనామా చేస్తా అన్యాయం జ‌రిగింది అన్నారు ఈ ప్ర‌భుత్వ‌ విప్ గారు.
 
ఇక ఇక్క‌డ వైసీపీ నేత కొఠారు రామ‌చంద్ర‌మూర్తి త‌న‌యుడు కొఠారు అబ్బ‌య్య చౌద‌రి పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా ఉంటున్నారు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో.... గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ చేసిన త‌ప్పిదం ఏమిటి అంటే ఇక్క‌డ త‌ణుకుకు చెందిన మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వ‌ర‌రావుకు సీటు ఇచ్చారు... జ‌గ‌న్ ఇక త‌ణుకులో చీర్ల రాధ కు సీటు ఇచ్చారు.
 
అయితే సామాజిక‌వ‌ర్గం వేరు అలాగే ప్రాంతం వేరు ఎక్క‌డ నుంచో వ‌చ్చిన నాయ‌కుడు పైగా కాంగ్రెస్ నుంచి వైసీపీకి వ‌చ్చిన నేత దీంతో ఇక్క‌డ చింత‌మ‌నేని విజ‌యం సాధించారు గ‌త ఎన్నిక‌ల్లో.... ఇక ఇక్క‌డ కొఠారు నుంచి బాధ్య‌త‌లు త‌న‌యుడు యూకే నుంచి రావ‌డంతో అబ్బ‌య్య చౌద‌రికి అప్ప‌గించారు రెండు మండ‌లాల్లో వైసీపీకి చాలా ప‌ట్టు ఉంది.. మ‌రో మండ‌లంలో తెలుగుదేశం 40 శాతం మాత్ర‌మే అభిమానంతో ఉన్నారు ప్ర‌జ‌లు... ఇక ఈ నాలుగేళ్లుగా చింత‌మ‌నేని ధోర‌ణి న‌చ్చ‌డం లేదు స్ధానిక నాయ‌కులు ఈ ఎమ్మెల్యే ట‌ర్మ్ లో వివాదాల‌తోనే ఆయ‌న ప‌రిపాల‌న చేస్తున్నారు... గ‌తంలో లేని పాల‌న‌లా ఉంది అంటున్నారు అయితే ఇప్పుడు ఈ ట‌ర్మ్ లో స‌ర్కారు అధికారంలో ఉండ‌టంతో చింత‌మ‌నేనికి అడ్డు లేకుండాపోయింది అంటున్నారు.
 
అయితే ఇక్క‌డ చింత‌మ‌నేనికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయి.. కాదు అంటే మాగంటి కుటుంబం నుంచి ఇక్క‌డ ఎవ‌రైనా పోటికి దిగితే సామాజికంగా ఆ వ‌ర్గానికి సీటు ఇచ్చిన‌ట్టు ఉంటుంది.. ఇక్క‌డ క‌మ్మ సామాజిక‌వ‌ర్గం వారికి సీటు ఇస్తేనే గెలిచే ప‌రిస్దితులు గ‌త ఎన్నిక‌ల నుంచి క‌నిపిస్తున్నాయి అయితే జ‌గన్ ఆ విష‌యంలో ఈ సారి బాగానే ఆలోచించి వైసీపీ త‌రపున అబ్బ‌య్య చౌద‌రికి సీటు ఇవ్వ‌డం అక్క‌డ ఈ యువ నాయ‌కుడు చురుగ్గా తిర‌గ‌డం చూస్తుంటే చింత‌మ‌నేనికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ట‌ఫ్ పొలిటిక‌ల్ వార్ త‌ప్పుడు అని అనిపిస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.