జ‌గ‌న్ అదిరిపోయే ప్లాన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-04 14:32:48

జ‌గ‌న్ అదిరిపోయే ప్లాన్

తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్ర‌బాబు రాజ‌కీయం అంటే ముందుగా గుర్తువ‌చ్చేది కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలు.. ఎన్టీఆర్ పేరు చెప్పి కృష్ణా రాజ‌కీయం చేస్తారు.. అలాగే గుంటూరు పేరు చెప్పి సామాజిక‌వ‌ర్గంతో రాజ‌కీయం చేస్తారు అంటారు.... ఇక సొంత జిల్లా చిత్తూరులో చంద్ర‌బాబు త‌న కంచుకోట‌గా చెప్పుకుంటారు...  జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీ జ‌గన్ పై  విష ప్ర‌చారం మొద‌లుపెట్టినా?  పాద‌యాత్ర‌కు జ‌నం రావ‌డం లేదు అని చెప్పినా?  విశేషంగా జ‌నం త‌ర‌లి వ‌స్తున్నారు... అయితే రాయ‌ల‌సీమ వ‌ర‌కూ పాద‌యాత్ర ఓ ఎత్తు అయితే, ఇటు కోస్తాలో జ‌గ‌న్ పాద‌యాత్ర విశేషంగా అశేష జ‌న‌వాహినితో వెళుతోంది.
 
ఇక కృష్ణా జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు... గుంటూరు నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర కృష్ణాలో ఎంట‌ర్ అయిన తొలిరోజే తెలుగుదేశం నేత మాజీ  ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి వైసీపీలో చేరారు.. ఇక త‌ర్వాత కాట‌సాని జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరారు..ఇక క‌న్నా కూడా కృష్ణాజిల్లా పాద‌యాత్ర‌లో జ‌గ‌న్  ఉన్నా స‌మ‌యంలోనే ఆయ‌న  జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరుతారు అని అంటున్నారు.
 
ఇక్క‌డ 2014 ఎన్నిక‌ల్లో భారీ ఎత్తున విజ‌యం సాధించింది ప‌లు హామీలు ఇచ్చి  తెలుగుదేశం పార్టీ... ఇక గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా ఉన్నా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా  జిల్లాలో తెలుగుదేశం మెజార్టీ స్ధానాల్లో అప‌జ‌యం పాల‌వ్వ‌డం ఖాయం అనేది తెలుస్తోంది పలు సెగ్మెంట్ల‌లో..... ఇక ప్రకాశం -గుంటూరు- కృష్ణా జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌పై మీడియాలు కూడా క‌వ‌రేజ్ పెంచాయి.... గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాలు తెలుగుదేశానికి ప్ల‌స్ అయినా ఇప్పుడు వైసీపీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యావ‌కాశాలు ఉన్నాయి అని స‌ర్వే సంస్ద‌లు కూడా తెలుపుతున్నాయి... ఇక అధికార పార్టీ కూడా వైసీపీ విజ‌యం ఖాయం అనే ఆలోచ‌న‌లోనే ఉంది.. జ‌గ‌న్ పై నేరుగా విమ‌ర్శ‌లు పెంచారు, రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు మానేసి?  బీజేపీ జ‌గ‌న్ దోస్తి అంటూ కొత్త పాఠాన్ని ప్ర‌జ‌ల‌కు భోదిస్తున్నారు తెలుగుదేశం నాయ‌కులు.
 
ఇక్క‌డ ఎన్టీఆర్ కు సొంత జిల్లా అయినా తెలుగుదేశం పై వ్య‌తిరేక‌త కూడా ఇక్క‌డ బ‌లంగానే ఉంది...  గ‌తంలో 2004 ఎన్నిక‌ల ఫ‌లితాల స‌ర‌ళిని ప‌రిశీలిస్తే మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న కృష్ణా జిల్లాలో టీడీపీకి రెండు సీట్లు మాత్ర‌మే ద‌క్కాయి... ఇక 2009 లో కూడా కాంగ్రెస్ ఇక్క‌డ బాగానే రాణించింది... అయితే సీట్ల స‌ర్దుబాటులో కాంగ్రెస్ కాస్త వెన‌క‌డుగు వేసింది... దీంతో తెలుగుదేశం ఎక్కువ సీట్లు గెలుచుకుంది. అలాగే ప్ర‌జారాజ్యం రాక‌తో కాంగ్రెస్ కు మైన‌స్ అయింది.
 
2009లో టీడీపీ 8 సీట్లు సాధించగా.. ప్రజారాజ్యం 2.. కాంగ్రెస్ ఆరు చోట్ల విజయం సాధించింది. 2014లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా టీడీపీ 10 స్థానాల్లో విజయం సాధించగా.. వైఎస్సార్ కాంగ్రెస్ ఐదు స్థానాల్లో.. టీడీపీ బలపర్చిన బీజేపీ అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు... ఇప్పుడు ప‌రిస్దితి చూస్తుంటే వైసీపీ మళ్లీ గ‌త కాంగ్రెస్ వైభ‌వాన్ని తీసుకువ‌స్తుంది అంటున్నారు... ఇక్క‌డ త‌మ సామాజిక‌వ వ‌ర్గం వారు ఉన్నా తెలుగుదేశం మెజార్టీ గెలుచుకోక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం  వేస్తుంది...
 
ముఖ్యంగా అభివృద్దికి బాట‌లు వేసేవారికి ఓటు ప‌డుతుంది అంటున్నారు ఇక్క‌డ ప్ర‌జ‌లు... నాడు కాంగ్రెస్ హాయాంలో విజ‌యవాడ ఎంపీ స్ధానాలు కూడా గెలుచుకోవ‌డం తో ఇక్క‌డ అభివృద్ది జ‌రిగింది... కేంద్రంలో కాంగ్రెస్ ఉండ‌టం అభివృద్ది ప‌రుగులు పెట్టింది... ఇప్పుడు వైసీపీ ఇక్క‌డ పాగా వేసేలా ఉంది. ఇక్క‌డ జ‌గ‌న్ కూడా అద్బుత మైన పొలిటికల్ స్ట్రాట‌జీతో ముందుకు వెళుతున్నారు.... అందుకే  వైసీపీతో ఎవ‌రు క‌లిసి వ‌స్తే వారితో ముందుకు వెళ్లేలా జ‌గ‌న్ వెళుతున్నారు... ఇది జ‌గ‌న్ కు ఇక్క‌డ మ‌రింత పాజిటివ్ అవుతోంది.
 
మొత్తానికి జ‌గ‌న్ కు ఇక్క‌డ వ‌స్తున్న ప్ర‌జాధ‌ర‌ణ చూస్తుంటే విజ‌యం వ‌రించే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి అంటున్నారు ఇక్క‌డ ప్ర‌జ‌లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.