తూ.గో లో పొలిటికల్ మార్క్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-12 12:53:10

తూ.గో లో పొలిటికల్ మార్క్

తెలుగుదేశం పార్టీ జ‌గ‌న్ పాద‌యాత్ర జ‌స్ట్ అనుకుంది కాని త‌క్కువ అంచ‌నా వేశాము అని రెండో రోజే తెలుసుకుంది. అయితే జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర న‌వ‌ర‌త్నాల‌తో ముందుకు వెళుతోంది... ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ ప్ర‌జారంజ‌క‌పాల‌న చూపిస్తా అంటూ ముందుకు వెళుతున్నారు వైయ‌స్ జ‌గ‌న్. ఇక రాయ‌ల‌సీమ‌, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ‌గోదావ‌రిలో జ‌గ‌న్ పాద‌యాత్ర జ‌రుగుతోంది.
 
అయితే అన్ని జిల్లాలో జ‌గ‌న్ కు ఎంతో ప్రజాద‌ర‌ణ క‌నిపించింది... ఇక ఇప్పుడు ఆయ‌న పాద‌యాత్ర‌ తూర్పుగోదావ‌రి జిల్లాలోకి ఎంట‌ర్ కానుంది..మొత్తం 280 కిలోమీటర్లు 16 నియోజకవర్గాలలో ఆయ‌న పాద‌యాత్ర జ‌రుగ‌నుంది.ఆ పార్టీ సీనియర్ నేత ఎంపీ వైవి సుబ్బారెడ్డి. ఈనెల 12 మధ్యాహ్నం వైసిపి అధినేత జగన్ పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశిస్తుంది అని తెలియ‌చేశారు.
 
 మొత్తం 16 నియోజకవర్గాల మీదుగా జగన్ 280 కిలో మీటర్ల దూరం పాదయాత్ర చేయనున్నారు... అలాగే  రాజమండ్రి, అమలాపురం, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా టూర్ ను ప్లాన్ చేశారు వైసిపి నేతలు.. ఇక జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర కోసం కేడ‌ర్ జిల్లా నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, ఎదురుచూస్తున్నారు.. రోజుకు 13 నుంచి 15 కిలోమీటర్ల దూరం జగన్ నడుస్తారని అన్ని వర్గాల ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు వింటారని వైసిపి వర్గాలు తెలియచేశాయి.
 
ఇక ఇక్క‌డ కూడా కాపు సెగ్మెంట్లు అధికంగా ఉండ‌టం ముఖ్యంగా ముద్ర‌గ‌డలాంటి నాయ‌కులు ఉన్న ప్రాంతం, అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల సెగ్మెంట్లు ఇలా చెప్పుకుంటూ పోతే జ‌గ‌న్ ఎటువంటికొత్త అస్త్రాల‌తో ముందుకు వెళ‌తారా అని నేత‌లు జిల్లా నాయ‌కులు ఎదురుచూస్తున్నారు. ఇక్క‌డ కాపుల‌కు సంబంధించి ఎటువంటి హామీ జ‌గ‌న్  ఇస్తారు అనేది చూడాలి. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.