అధికారం లోకి రాగానే క‌చ్చితంగా చేస్తా...?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-01 01:05:04

అధికారం లోకి రాగానే క‌చ్చితంగా చేస్తా...?

ప్ర‌తిప‌క్షనేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి  చేప‌ట్టిన ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర ప్ర‌స్తుతం ప్ర‌కాశం జిల్లాలో కొన‌సాగుతోంది. ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయబోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు వైయ‌స్ జ‌గ‌న్‌. ప్ర‌తిప‌క్ష నేత  పాద‌యాత్ర‌కు రాష్ట్ర‌ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. 
 
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చీమ‌కుర్తిలో నిర్వ‌హించిన బ‌హిరంగస‌భ‌లో మాట్లాడిన వైయ‌స్ జ‌గ‌న్, ప‌లు అస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. స్థానికంగా ఉన్న‌టువంటి గ్రానైట్ ప‌రిశ్ర‌మ దివాలా తీయ‌డానికి చంద్ర‌బాబు కార‌ణం అని... అందువ‌ల్ల 2 వేల పాలిషింగ్‌ యూనిట్లు, లక్ష మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని జ‌గ‌న్ అన్నారు.
 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌న అంద‌రి ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే గ్రానైట్ పాలిషింగ్‌ యూనిట్లకు రాయల్టీని 40 శాతం తగ్గిస్తామని, దీంతో పాటు ప్రస్తుతం యూనిట్‌కు రూ.7.35 ఉన్న విద్యుత్‌ చార్జీలు రూ.3.75కు తగ్గిస్తామని ప‌రిశ్ర‌మ‌ల వారికి భ‌రోసా క‌ల్పించారు వైయ‌స్ జ‌గ‌న్‌.... అలాగే ప‌రిశ్ర‌మ‌ల్లో ప‌ని చేసే కార్మికుల కోసం ఇదే ప్రాంతంలో ఈఎస్‌ఐ హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తామ‌ని జగన్‌ ప్రకటించారు... దీంతో అక్క‌డున్న ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా హ‌ర్ష‌ద్వానాల‌తో  ధ‌న్య‌వాదాలు తెలిపారు.
 
గ‌తంలో దివంగ‌తనేత ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప‌రిశ్ర‌మ‌లు అభివృద్ది చెంద‌డానికి  3,200 ఉన్న రాయల్టీని 1800కు తగ్గించారని జగన్ గుర్తు చేశారు. కార్మికుల కోసం ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకలకు పెంచారని  వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. తెలుగుదేశం స‌ర్కారు అధికారంలో కి వ‌చ్చిన త‌ర్వాత ప‌రిశ్ర‌మ‌లు రాకుండా కేవ‌లం పేప‌ర్ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నాయి అని విమ‌ర్శించారు. ఇప్ప‌టికే వైయ‌స్ జ‌గ‌న్ ప‌లు హామీల‌ను ప్ర‌జ‌ల‌కు ఇస్తూ ,ముందుకు వెళుతున్నారు.. వైసీపీ అధికారంలోకి రాగానే తాను చేయ‌బోయే ప‌నుల‌ను, జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డంలో స‌ఫ‌లీకృతుడు అవుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.