అదిరిన జ‌గ‌న్ పంచ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-29 11:26:02

అదిరిన జ‌గ‌న్ పంచ్

ప్ర‌తిప‌క్ష‌నేత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం సైకిల్ పార్టీ కంచుకోట  కృష్ణా జిల్లా ఉయ్యూరులో నిర్విరామంగా కొన‌సాగుతోంది... ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అక్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ తాము అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
ఇక తాజాగా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా మ‌రోసారి ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు... ఈ బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ మాట్లాడుతూ... ఒక‌ప‌క్క కేంద్రంపై పోరాటం చేస్తున్నాను అంటారు, మ‌రోప‌క్క బీజేపీతో ర‌హ‌స్య మంత‌నాలు జ‌రుపుతున్నారని జ‌గ‌న్ మండిప‌డ్డారు...నాలుగు రోజుల క్రితం చంద్ర‌బాబు మహారాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక మంత్రి భార్యను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌గా చేశారు... ఎందుకు ఆమెను బోర్డు మెంబ‌ర్ గా నియ‌మించారు అని అడిడ‌గితే పొంతనలేని సమాధానాలు చెబుతార‌ని అన్నారు.
 
చంద్ర‌బాబు చేసేది  కుమ్మక్కు కాదా? కాళ్లు పట్టుకోవడం కాదా? ఇది భయం కాదా చంద్రబాబూ? కాకా పట్టడం అంటే ఇది కాదా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు... కేవ‌లం త‌న స్వార్థ రాజ‌కీయాల కోసం రాజ్యంగాన్నితుంగ‌లో విచ్చ‌ల‌విడిగా ప్ర‌జా ద‌నాన్ని విదేశాల‌కు త‌ర‌లిస్తున్నార‌ని జ‌గ‌న్ ఆరోపించారు.
 
 ప్ర‌త్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా ఏపీ భ‌వ‌న్ లో నిరాహార దీక్ష చేస్తే చంద్ర‌బాబు వారికి మద్ద‌తు ఇవ్వకుండా త‌ప్పించుకు తిరిగార‌ని మండిప‌డ్డారు జ‌గ‌న్ ... ఇప్పుడు సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌రకు వ‌స్తున్న త‌రుణంలో మ‌రో కొత్త నాట‌కానికి తెర లేపుతున్నార‌ని జ‌గ‌న్ అన్నారు... ఈ నెల 30న  తిరుప‌తిలో కేంద్రానికి వ్య‌తిరేకంగా చంద్ర‌బాబు స‌భ‌ను పెడుతున్నార‌ని, ఆయ‌న‌ పుట్టిన రోజున ద‌ర్మ‌పోరాట‌ దీక్ష పేరుతో ప్ర‌జా ద‌నాన్ని సుమారు 30 కోట్ల‌కు పైగా దుర్వినియోగం చేశార‌ని, మ‌ళ్లీ ఇప్పుడు తిరుప‌తి దీక్ష‌కు ప్ర‌జా ద‌నాన్ని ఎంత దుర్వినియోగం చేస్తారో అని ఆరోపించారు.
 
 
చంద్ర‌బాబు దీక్ష చేస్తుంటే త‌న‌కు ఒక‌టి గుర్తుకు వ‌స్తోంద‌ని అన్నారు..  గాంధీని చంపేసిన గాడ్సే ఇందుకు నిరసనగా  నిరాహార దీక్షకు కూర్చున్నట్టుగా ఉందని అన్నారు.. ఒక ప‌క్కేమో ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో ప్ర‌త్యేక హోదాకోసం పోరాడుత‌న్నాము అంటారు... మ‌రో ప‌క్క బీజేపీతో చీక‌టి ఒప్పందాల‌ను కుదుర్చుకుంటున్నార‌ని చంద్ర‌బాబు పై మండిప‌డ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.