జ‌గ‌న్ మ‌రో అరుదైన రికార్డు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-01 12:54:12

జ‌గ‌న్ మ‌రో అరుదైన రికార్డు

ప్ర‌జ‌ల మ‌నిషిలా జ‌గ‌న్ త‌న పేరును సార్ధ‌కం చేసుకుంటున్నారు.. ఆరునెలల పాటు త‌ల‌పెట్టిన సంక‌ల్ప‌యాత్ర   ఇడుపులపాయ నుంచి  ఇచ్చాపురం వ‌ర‌కూ కొన‌సాగ‌నుంది.. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ కు అశేష జ‌న‌సందోహ మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఇప్పుడు ప్ర‌కాశం జిల్లాలో కొన‌సాగుతున్న ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌కు, ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున జ‌గ‌న్ తో క‌లిసి న‌డుస్తూ, వారి స‌మ‌స్య‌లు ఏక‌ర‌వుపెట్టుకుంటున్నారు.
 
ఇప్ప‌టికే జ‌గ‌న్ ఆరు జిల్లాల్లో 43 అసెంబ్లీ  నియోజకవర్గాల్లో పాద‌యాత్ర సాగించారు.. తాజాగా పాద‌యాత్ర‌కు వంద‌రోజులు  పూర్తి చేసుకున్నారు జ‌గ‌న్.. అలాగే ఇప్పటికే 39 బహిరంగ సభల్లో జ‌గ‌న్ ప్ర‌సంగించారు. ప్ర‌జ‌ల మద్ద‌తు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్. అడుగ‌డుగునా జ‌గ‌న్ కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు...ప్ర‌కాశం జిల్లాలో వంద‌రోజుల పాద‌యాత్ర‌కు గుర్తుగా జ‌గ‌న్ పైలాన్ ఆవిష్క‌రించారు.
 
రాష్ట్రానికి ప్ర‌త్యేక హూదా సాధ‌నే ల‌క్ష్యంగా ముందుకు వెళుతున్నారు వైయ‌స్ జ‌గ‌న్.. ఒక్క నిరుద్యోగి లేకుండా రాష్ట్రంలో నిరుద్యోగిత క‌నిపించ‌కుండా చేయాలి అనే సంక‌ల్పంతో జ‌గ‌న్ ముందుకు వెళుతున్నారు. ప‌త్రీఒక్క‌రూ చ‌దువుకోవాలి అని, వ్య‌వ‌సాయానికి మంచి రోజులు వ‌స్తాయ‌ని రైతుల‌ను ఆదుకుంటాను అని జ‌గన్ హామీ ఇస్తున్నారు. అలాగే ప్ర‌జ‌ల్లో వైసీపీ త‌ర‌పున త‌న తండ్రి రాజ‌న్న రాజ్య‌స్ధాప‌నే ధ్యేయంగా ముందుకు వెళుతున్నారు వైయ‌స్ జ‌గ‌న్.
 
గతేడాది నవంబర్ ‌6న ప్రారంభమైన జననేత సుదీర్ఘయాత్ర నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది.. చంద్ర‌బాబులాగా త‌న‌కు కాసులు క‌క్కుర్తిలేదు అని అన్నారు జ‌గ‌న్, త‌న పాద‌యాత్ర తొలిరోజు నుంచి జ‌గ‌న్ కు పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల నుంచి మద్ద‌తు వ‌స్తోంది. 
 
నేను వేసే ప్రతి అడుగులో మీ అప్యాయత, మద్దతు కనిపిస్తోంది. అడుగడుగునా మీరు చూపించే ఆత్మీయత, అభిమానంతోనే యాత్ర సాగిస్తున్నా. దివంగత మహానేత వైఎస్సార్‌పై మీరు చూపే అభిమానం నాకు బలాన్నిస్తోంది. ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది. ఈ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి, అపనమ్మకం, మీ బాధలు నాకు తెలుస్తున్నాయి. మీ ఆశ్వీరాదాలు.. నాకు కొండంత బలాన్ని ధైర్యాన్ని ఇస్తున్నాయి అని జ‌గ‌న్  - వెయ్యి కి.మీ పాదయాత్ర పూర్తి అయిన సందర్భంగా ట్వీట్ చేశారు.
 
!! జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో హైలెట్స్ తెలుసుకుందాం !! 
తొలి రోజు : వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయలో ప్రారంభం (నవంబర్‌ 6, 2017) 
25వరోజు : కర్నూల్‌ జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం, మదనాంతపురంలో ప్రారంభం.. చెరువు తొండలో ముగింపు (డిసెంబర్‌3, 2017)
50వ రోజు : చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం సీటీఎంనుంచి ప్రారంభం.. జమ్మిలవారిపల్లిలో ముగింపు (జనవరి 2, 2018)
100వ రోజు :  ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం ఉప్పలపాడులో ప్రారంభం, (ఫిబ్రవరి 28, 2018)
 
!!  కిలోమీటర్ల వారిగా పాదయాత్ర మైలురాళ్లు !!
 
0 - వైఎస్‌ఆర్‌ జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయ (నవంబర్‌ 6, 2017) 
100 - క‌ర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి సమీపం (నవంబర్‌ 14, 2017) 
200 - కర్నూలు జిల్లా, డోన్‌ నియోజకవర్గం ముద్దవరం (నవంబర్‌ 22, 2017)
300 - కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం కారుమంచి (నవంబర్‌ 29, 2017)
400 - అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం గుమ్మేపల్లి (డిసెంబర్‌ 7,2017)
500 - అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు (డిసెంబర్‌ 16, 2017)
600 - అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం కటారుపల్లి క్రాస్‌ రోడ్స్‌ (డిసెంబర్ ‌24, 2017)
700 - చిత్తూరు జిల్లా, పీలేరు నియోజకవర్గం చింతపర్తి శివారు (జనవరి 2, 2018)
800 - చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం నల్లవెంగనపల్లి (జనవరి 11, 2018)
900 - చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి హరిజనవాడ (జనవరి 21, 2018)
1000 - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో పైలాన్‌ ఆవిష్కరణ (జనవరి 29, 2018)
1100 - నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం, క‌లిగిరి (ఫిబ్రవరి 7, 2018)
1200 - ప్ర‌కాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం, రామ‌కృష్ణాపురం (ఫిబ్రవరి 16, 2018)
1300 - ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని నందనమారెళ్ల (ఫిబ్రవరి 25, 2018)
 
ప్ర‌తీ మైలురాయికి జ‌గ‌న్ గుర్తుగా ఒక్కోమొక్క‌ను నాటుతూ ముందుకు వెళ్లారు..వంద రోజుల పాద‌యాత్ర గుర్తుగా  పైలాన్, వైఎస్‌ విగ్రహం ఆవిష్కరించారు వైయ‌స్ జ‌గ‌న్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.