బాబు పై అదిరిపోయే క‌థ చెప్పిన జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-06 11:35:55

బాబు పై అదిరిపోయే క‌థ చెప్పిన జ‌గ‌న్

స‌మాజంలో అగ్ర‌కులాల వారికి కూడా పేద‌రికం ఉంది అని వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు.. ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్ మ‌రింత ప్ర‌జాక్షేత్రంలో దూసుకుపోతున్నారు.. ఆయ‌న‌కు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు మ‌రింత ఎక్కువ‌గా వ‌స్తోంది. మ‌న ప్ర‌భుత్వం రాగానే ప్ర‌తీ ఒక్క‌రికీ న్యాయం జ‌రిగేలా చూస్తాను అని అన్నారు.. అగ్ర‌కులాల్లో ఉన్న వారికి కూడా ఒక కార్పొరేష‌న్ తీసుకువ‌స్తామ‌ని.. క‌మ్మ, రెడ్డి ,క్ష‌త్రియ కులాల వారికి కూడా ప్ర‌త్యేక కార్పొరేష‌న్ ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు.
 
ఈ కులాల్లో పేద‌రికంలో ఉన్న పిల్ల‌ల‌కు వ‌డ్డీ  లేని రుణాలు ఇస్తే, బాగా చ‌దువుకుకుంటార‌ని ఆర్ధికంగా మ‌రింత మెరుగు అవుతార‌ని అన్నారు జ‌గ‌న్. ఇక కేంద్ర బ‌డ్జెట్ పై జ‌గ‌న్ ఏమ‌న్నారంటే?  2014 నుంచీ ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ.. తన ఎంపీలను కేంద్ర మంత్రివర్గంలో కొనసాగిస్తున్న చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఐదవ బడ్జెట్‌ చూశాక విలవిల్లాడాడట ఇది చాలా దారుణం మ‌రింత  విడ్డూరంగా ఉంది అన్నారు జ‌గ‌న్.. బ‌డ్జెట్ పై కేంద్ర కేబినెట్ కూర్చున్న స‌మ‌యంలో మీ మంత్రులు ఉన్నారు క‌దా, మరి ఆ స‌మ‌యంలో వారు ఏం చేశారు? ఏపీకి అన్యాయం జ‌రుగుతుంటే కేబినెట్లో మౌనం ఎందుకు వ‌హించారు అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.
 
జ‌గ‌న్ ఓ క‌థ‌ను చెప్పారు బాబు పై స‌టైరిక్ గా 
 
కోర్టు బోనులో ఓ ముద్దాయిని నిలబెట్టారట. జడ్జి వచ్చాక  ముద్దాయి అయ్యా.. తల్లీదండ్రీ లేని వాణ్ని.. నాకు దిక్కెవరూ లేరు సార్‌. నన్ను విడిచిపెట్టండి సార్‌’అంటూ ఆ ముద్దాయి బిగ్గరగా ఏడుపు మొదలు పెట్టాడట. అది చూసిన జడ్జి అతన్ని ఎందుకు తెచ్చారు? ఏం తప్పు చేశాడని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను అడిగాడట. అప్పుడాయన ‘సార్‌.. ఇతనివన్నీ దొంగ ఏడుపులు. తల్లిదండ్రుల్ని అతడే చంపాడు. అందువల్లే బోనులో నిలబడ్డాడు’అని చెప్పాడట. సరిగ్గా చంద్రబాబు వైఖరి కూడా అదే విధంగా ఉంది. రాష్ట్రం విడిపోవడానికి చంద్రబాబే కారణం. ఆయనే లేకుంటే రాష్ట్రం కలిసికట్టుగానే ఉండేది. ప్రత్యేక హోదా రాకపోవడానికీ ఆయనే కారణం. ఆ రోజేమో ప్రత్యేక హోదా సంజీవని అన్నాడు. ఈ రోజేమో అదేమైనా సంజీవనా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు అని జ‌గ‌న్ నిల‌దీశారు.
 
ఇలాంటి దొంగ ఏడుపుల‌ను న‌మ్మ‌కండి అని జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేశారు.. మన ప్ర‌భుత్వం పేద‌ల ప‌క్షాన ఉంటుంది  అని ఇలాంటి అరాచ‌కాల‌ను అణిచివేస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌జాస‌భ‌లో ప‌లు వ్యాఖ్య‌లు చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.