బాబు నీకు మాన‌వ‌త్వం ఉందా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-31 15:54:11

బాబు నీకు మాన‌వ‌త్వం ఉందా

గుంటూరు మీటింగ్ కు ర‌మ్మ‌ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింల‌ను పిలిపించింది మీరు కాదా అక్క‌డ మీరిచ్చిన స‌ల‌హాల‌నే నిల‌బెట్టుకోమ‌ని ప్ర‌జాస్వామ్య‌యుతంగా అడిగితే, ప్ల‌కార్డ్ ల‌తో ప్ర‌ద‌ర్శిస్తే వారిపై పాశ‌వికంగా ప్ర‌వ‌ర్తిస్తారా అంటూ ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహన్ లేఖ ద్వారా స్పందించారు. 
 
ముస్లింలు చేసిన త‌ప్పేమిటి మీరు మేనిఫెస్టోలో చెప్పిన‌ట్టుగా ఉర్దూ మీడియం పాఠ‌శాల‌లు ఎక్క‌డ‌ని అడ‌గ‌టం త‌ప్పా మ‌ద‌ర్సా విద్యార్థుల‌కు ఉచిత బ‌స్సుపాసులు స్కూల్ యూనిఫామ్ లు ఎక్క‌డిచ్చార‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ప్ర‌శ్నించ‌డం పాప‌మా అని జ‌గ‌న్ మండిప‌డ్డారు. స్వాతంత్య్రం వ‌చ్చాక ఎప్పుడు లేనివిధంగా ముస్లింల‌కు  రాష్ట్రంలో మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డాన్ని లేవ‌నెత్తుతూ మీరు చేసిన అన్యాయాన్ని గుర్తు చేయ‌డం నేర‌మా అని చంద్రబాబు ను జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. 
 
సుమారు 30 గంట‌ల‌పాటు ఎక్క‌డ ఉంచారో తెలియ‌నియ్య‌కుండా వారిని పోలీసుల‌తో నిర్భందించి , హింసించి ఆ త‌ర్వాత కేసులు బ‌నాయించి జైల్లో పెట్ట‌డం న్యాయ‌మేనా అని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో మాన‌వ హ‌క్కులు లేవా మాన‌వ‌త్వం ఉందా మీకూ అని జ‌గ‌న్, చంద్ర‌బాబును సూటిగా ప్ర‌శ్నించారు. ముఖ్య‌మంత్రి గారు... వెంట‌నే ఆ యువ‌కుల‌పై పెట్టిన త‌ప్పుడు కేసుల‌ను బేస‌రుతుగా ఉప‌సంహ‌రించుకుని వారికి క్ష‌మాప‌న చెప్పాల‌ని డిమాండ్ చేస్తూన్నాని లేఖ ద్వారి పేర్కొన్నార