బాబు పాల‌న‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan in padayatra
Updated:  2018-03-20 11:00:57

బాబు పాల‌న‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌తిప‌క్ష నేత, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ త‌ల‌పెట్టిప ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు అడుగ‌డుగున ప్ర‌జ‌లు బ్ర‌హ్మర‌థం ప‌డుతున్నారు... ఈ సంక‌ల్ప‌యాత్ర తెలుగు దేశం పార్టీ నాయ‌కుల‌కు కంచుకోట అయిన గుంటూరు జిల్లాలో నిర్విరామంగా సాగుతోంది... అశేష జ‌న‌వాహిని మ‌ధ్య న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తూ... అధికార అండ‌తో సైకిల్ పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ఎండ‌గ‌తూ ముందుకు సాగుతున్నారు వైసీపీ అధినేత‌.
 
అయితే ఈ సంకల్ప యాత్ర‌లో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు అవినీతిని గుట్టు ర‌ట్టు చేశారు...  అబద్ధాలు, అన్యాయం, అధర్మం అనే పునాదులపై రాష్ట్రంలో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని... అలాగే రైతులు, మహిళలు, యువత.. ఎవరినీ వదలకుండా అన్ని వర్గాల వారిని మోసం చేసిన ఘనత చంద్రబాబుకే ద‌క్క‌తుంద‌ని జ‌గ‌న్ అన్నారు.
 
ప్ర‌త్యేక హోదా కేంద్రానికి తాక‌ట్టు పెట్టి అమాయ‌క రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యే హోదా సాధిస్తామంటూ పూట‌కొక మాటా మారుస్తున్నార‌ని మండిప‌డ్డారు జ‌న‌నేత‌... ఆందులో భాగంగానే ఒక వైపు రైతులు పండించిన పంట‌కు గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా గిట్టుబాటు ధ‌ర లేక అల్లాడి పోత‌కున్నార‌ని, రైతుల గిట్టుబాబు ధ‌ర‌ల‌కు కూడా చంద్ర‌బాబు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నార‌ని జ‌గ‌న్ అన్నారు.
 
చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత ఆయ‌న ప‌రిపాల‌న ఎలా సాగిందంటే జ‌గ‌న్ మాట‌ల ద్వారా తెలుసుకుందాం...  
 
1. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఇవాళ బ్యాంకుల వారు పంపిస్తున్న నోటీసులు మాత్రం ఇంటికి వస్తున్నాయి.
2. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానన్నారు. ఇవాళ రుణమాఫీ కార్యక్రమం అప్పులపై అయిన వడ్డీకి కూడా సరిపోవడం లేదు. 
3. రైతన్నలకు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులకు ప్రభుత్వాలే వడ్డీ కట్టేవి. ఈ పెద్ద మనిషి ఆ డబ్బు కట్టక పోవడంతో ఇవాళ బ్యాంకులు రైతులకు సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వడం లేదు. 
4. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలన్ని మాఫీ చేస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. 
5. జాబు రావాలంటే బాబు రావాలన్నారు.. లేదంటే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. 47 నెలలైనా ఇవాళ ఉపాధి లేదు. ఉద్యోగం లేదు.ఈ లెక్కన నెలకు రూ.2 వేలు చొప్పన రూ.94 వేలు బాకీ పడ్డారు. ఈ డబ్బులు ఎప్పుడిస్తారని చంద్రబాబును అడగండని జ‌గ‌న్ అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.