చిన రాజ‌ప్ప‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-26 11:21:29

చిన రాజ‌ప్ప‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌తిప‌క్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌ను అలాగే కోస్తాలోని ఐదు జిల్లాల‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం టీడీపీ కంచుకోట పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గంలో నిర్విరామంగా కొన‌సాగుతుంది. ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో వైసీపీ నాయ‌కులు ఏర్పాటు చేసిన భారీ భ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ మాట్లాడుతూ మ‌రోసారి ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుపై అలాగే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు జ‌గ‌న్. గంత‌లో ఎన్న‌డు లేని విధంగా... టీడీపీ అధికారంలో హోం మంత్రి అయిన చినరాజ‌ప్ప హ‌యాంలో పెద్దాపురంలో సుమారు ఆరు హ‌త్య‌లు జ‌రిగాయ‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. 
 
అంతేకాదు పెద్దాపురంలో కేవ‌లం టీడీపీ కార్య‌క‌ర్త‌లుకు మాత్ర‌మే పించ‌న్లు ఇవ్వాల‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లకు ఇవ్వ‌కుడ‌దని, ప్ర‌త్యేకంగా చినరాజ‌ప్ప ఫోన్ చేసి చెబుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శలు చేశారు. దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హయాంలో పోల‌వ‌రం ప్రాజెక్ట్ శ‌ర‌వేగంగా జ‌రిగితే టీడీపీ హయాంలో న‌త్తన‌డ‌క‌గా సాగుతోంద‌ని, ఈ న‌త్తన‌డ‌క‌ను హోం మంత్రి ప్ర‌శ్నించాల్సిందిపోయి ముఖ్య‌మంత్రికి సాక్షాత్తు గ‌న్ మెన్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు.చివ‌ర‌కు టీడీపీ నాయ‌కులు పోల‌వ‌రం ప్రాజెక్ట్ ను త‌న అవినీతి ప్రాజెక్ట్ గా మార్చుకున్నార‌ని ఆరోపించారు.
 
వైఎస్ హ‌యంలో ప్ర‌తీ రైతు పండించిన పంట‌కు గిట్టు భాటు ధ‌ర వ‌చ్చేద‌ని కానీ చంద్ర‌బాబు హ‌యాంలో గిట్టు బాటు ధ‌ర కాదు క‌దా పండించిన పంట‌కు ఖ‌ర్చు చేసిన డ‌బ్బులు కూడా రాకున్నాయ‌ని జ‌గ‌న్ ఆరోపించారు. అలాగే టీడీపీ నాయ‌కులు నీరు చెట్టుకింద ప్ర‌జా ధ‌నంతో ఈ ప‌థ‌కాన్ని స్థాపించార‌ని అయితే  ఈ ప‌థ‌కం కింద టీడీపీ నాయ‌కులు విచ్చ‌ల‌విడిగా అవినీతికి పాల్ప‌తున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.