జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-16 13:24:38

జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంకల్ప‌యాత్ర ప్ర‌స్తుతం టీడీపీకి కంచుకోట అయిన‌ తూర్పుగోదావ‌రి జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. పేరుకు మాత్ర‌మే సైకిల్ నాయకుల‌కు కంచుకోటే అయినా పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ ఈ జిల్లాలో అడుగు పెట్ట‌డంతో ఏ జిల్లాలో తెలుప‌నంత విధంగా ఈ జిల్లాలో ప్ర‌జ‌లు ఆయ‌న‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.
 
అంతేకాదు గ‌డిచిన ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుపుకు కీలకంగా మారిన నాయ‌కులు కూడా జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఒకవైపు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ మ‌రోవైపు అధికార‌బలంతో తెలుగుదేశం పార్టీ నాయ‌కులు పాటిస్తున్న రెండు నాలుక‌ల ధోర‌ణిని ప్ర‌జ‌లకు విమ‌రిస్తునే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా రాకుండా అడ్డుకున్న‌ది టీడీపీ నాయ‌కులే అని జ‌గ‌న్ తెలియజేస్తున్నారు.
 
అయితే తాజాగా పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని వైసీపీ రీజిన‌ల్ కో ఆర్డినేట‌ర్స్, అలాగే పార్టీ కీల‌క నేత‌లు భేటీ అయ్యారు. ఈ భేటీ సుమారు మూడు గంట‌ల‌పాటు వైసీపీ అధినేతతో వారు చ‌ర్చించారు. మ‌రికొద్ది రోజుల్లో రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ ఎన్నికలు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో పార్టీ నేత‌లు జ‌గ‌న్ తో స‌మావేశం అయి కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. విభ‌జ‌న చ‌ట్టంలో పొందుపరిచిన ప్ర‌త్యేక హోదాను ఏపీకి కేటాయించనందుకు బీజేపీకి వ్య‌తిరేకంగా ఓటు వెయ్యాల‌ని జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. 
 
ఈ భేటీ త‌ర్వాత వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ, రాజ్య‌స‌భ డిప్యూటి ఛైర్మ‌న్ ఎన్నిక‌ల్లో తాము బీజేపీకి వ్య‌తిరేకంగా ఓట్లు వేస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను బీజేపీ నెర‌వేర్చ‌నందుకే తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఆయ‌న తెలిపారు. అంతేకాదు పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు జ‌రిగినంత‌కాలం ప్ర‌త్యేక హోదాకోసం రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఫ్లకాడ్స్ ప‌ట్టుకుని నిర‌స‌న‌లు తెలుపుతార‌ని ధర్మాన ప్రసాదరావు స్ప‌ష్టం చేశారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.