జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-14 10:40:48

జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌న ల‌క్ష్యంగా ముందుకు వెళుతున్నారు వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. తెలుగుదేశం ఏపీకి ప్ర‌త్యేక హూదా సాధ‌న కోసం ఎటువంటి ముందు అడుగు వేయ‌డం లేద‌ని, కేంద్రంలో మంత్రులు గా ఇద్ద‌రు తెలుగుదేశం ఎంపీలు ఉన్నా, త‌మ‌కు బ‌డ్జెట్ లో అన్యాయం జ‌రిగింది అని ఇక్క‌డ కొత్త రాగం తీసుకున్న తెలుగుదేశం పై ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మండిప‌డ్డారు.
 
ప్ర‌త్యేక హోదా కోసం ఎంత‌వ‌ర‌కూ అయినా వెళ‌తాం అన్నారు వైయ‌స్ జ‌గ‌న్.. కేంద్రం పై మ‌రింత ఒత్తిడి తీసుకువ‌స్తామ‌ని అన్నారు వైయ‌స్సార్ సీపీ అధినేత  జ‌గ‌న్... ఏప్రియ‌ల్ 5 వ‌ర‌కూ కేంద్రానికి డెడ్ లైన్ పెట్టారు ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. ఇక పార్ల‌మెంట్ స‌మావేశాల స‌మ‌యానికి త‌మ ఎంపీల ద్వారా ప్ర‌త్యేక హూదా కోసం పోరాటానికి సిద్దం అవుతున్నారు జ‌గ‌న్..
 
మార్చి 1వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ఎదుట వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు చెందిన ప్రతి కార్యకర్త, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు ఆందోళన చేయ‌నున్నారు.. అలాగే పాద‌యాత్ర ప్రాంతానికి ప్ర‌తీ వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ చేరుకుంటారు.. అక్క‌డ నుంచి ప్రత్యేక హోదా మా హక్కు–ప్యాకేజీ మాకొద్దు అనే నినాదంతో వారంతా ఢిల్లీ చేరుకుని ధర్నా చేస్తారు.. ఢిల్లీలో మార్చి 5వ తేదిన ధ‌ర్నా చేయ‌నున్నారు ప్ర‌తీ వైసీపీ నాయ‌కుడు.
 
ఏప్రియ‌ల్ ఆర‌వ తేదీ వ‌రకూ మ‌న ఎంపీలు పార్ల‌మెంట్లో పోరాటం చేస్తారు, అయినా కేంద్రం ప్ర‌త్యేక హూదా పై ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోతే మ‌న ఎంపీలు రాజీనామా చేస్తారు అని వైయ‌స్ జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో తెలుగుదేశం నాయ‌కులు డైలమాలో ప‌డ్డారు. ఇక్క‌డ ఎంపీల‌కు స‌న్మానాలు చేయించ‌డం కాదు పార్లమెంట్లో రాజీనామాలు చేయాలి అని ప్ర‌జ‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు తెలుగుదేశం నాయ‌కుల‌పై.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.