జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jaganmohan rddy
Updated:  2018-04-01 12:38:11

జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

ఏపీ రాజ‌కీయాల్లో  గ‌త కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. గ‌తంలో ఎన్న‌డులేని విధంగా కేంద్ర ప్ర‌భుత్వం పై రాష్ట్రంలో ఉన్న అన్ని రాజ‌కీయ పార్టీలు మూకుమ్మ‌డిగా  పోరాటం చేస్తున్న విష‌యం తెలిసిందే. దేశ రాజ‌కీయాలు ఎంత ఉత్కంఠంగా ఉన్నాయో అదే స్థాయిలో  ఏపీలో కూడా ఉన్నాయి.  ఒక వైపు ప్ర‌త్యేక‌హోదా సాధించేంత వ‌ర‌కు వ‌ర‌కు త‌మ పోరాటం ఆగ‌ద‌ని టీడీపీ ప్ర‌క‌టిస్తే, మ‌రో వైపు హోదా కోసం త‌మ ప‌ద‌వుల‌ను సైతం త్యాగం చేస్తామ‌ని వైసీపీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌త్యేకహోదా పై ఇరు పార్టీలు నాయ‌కులు ఒక‌రి పై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు.
 
 
ప్ర‌తిపక్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర టీడీపీ కంచుకోట అయిన‌ గుంటూరు జిల్లాలో కోన‌సాగుతోంది. పేరేచర్లలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన‌ వైయ‌స్ జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ చేస్తున్న పోరాటానికి టీడీపీ  ఎంపీలు స‌హ‌క‌రించినా.. స‌హ‌క‌రించ‌క‌పోయినా పార్ల‌మెంట్ చివ‌రి రోజున‌ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ప్ర‌కటించ‌క‌పోతే వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలంతా రాజీనామాలు చేస్తార‌ని అన్నారు. ఆ త‌ర్వాత‌ దిల్లీలో ఉన్న‌ ఏపీ భవన్‌కు వెళ్ళి  ఆమరణ నిరాహార దీక్షలు చేపడతార‌ని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
 
వైసీపీ చేప‌డుతున్న ఈ పోరాటానికి రాష్ట్ర ప్రజలు మద్దతు నిల‌వ్వాలని ఆయ‌న కోరారు. వైసీపీ ఎంపీలు చేసే ఆమ‌ర‌ణ నిరాహార  దీక్షకు మద్దతుగా రాష్ట్రంలో ఉన్న‌ విద్యార్థులు, యువకులు కదలిరావాలని వైయ‌స్ జ‌గ‌న్‌ పిలుపునిచ్చారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్ర‌త్యేక‌హోదా కోసం దీక్షలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారి చేశారు వైయ‌స్ జ‌గ‌న్. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా ఉద్య‌మాన్ని అణిచిన చంద్రబాబు ఇపుడు ప్రత్యేక హోదా కోసం పోరాడ‌డం విడ్డూరంగా ఉంద‌ని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.