జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-03 12:14:05

జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్రలో భాగంగా విశ్వబ్రాహ్మ‌ణులు జ‌న‌నేత జ‌గ‌న్ క‌లుసుకున్నారు... త‌మ గ్రామంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎటువంటి అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేయ‌లేద‌ని జ‌గ‌న్ కు తెలిపారు...అయితే గ‌తంలో త‌మ‌కు న్యాయం చేయ‌మ‌ని అధికారుల‌ను వేడుకున్నా కానీ, క‌న్నెత్తి కూడా చూడ‌లేద‌ని జ‌గ‌న్ తో త‌మ ఆవేద‌న‌ను చెప్పుకున్నారు... ఆర్థికంగా సామాజికంగా వెనుక‌బ‌డిన వారమ‌ని త‌మ‌ను ఎలాగైనా ఆదుకోవాలంటూ జ‌గ‌న్ ను వేడుకున్నారు.
 
అయితే వారి భాద‌ను చూసిన‌ వైఎస్ జ‌గ‌న్ చ‌లించిపోయారు... ఈ సంద‌ర్భంగా వారికి అండగా ఉంటాన‌ని భ‌రోసా ఇస్తూ వైసీపీ అధికారంలోకిరాగానే ప్ర‌తీ ఒక్క‌రిని ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు జ‌గ‌న్... దివంగ‌తనేత ప్రియ‌త‌మ నాయ‌కుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి అధికారంలో ఉన్న‌ప్పుడు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అందుబాటులో జీవో నంబ‌ర్ 23,272 ఉండేద‌ని, ఆ జీవోలు  అమ‌ల్లో ఉన్న‌ప్పుడు వేధింపులకు గురికాకుండా ప్ర‌జ‌ల‌కు రక్షణగా ఉండేదని జ‌గ‌న్ తెలిపారు... కానీ చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యాక ఈ జీవోలు క‌నుమ‌రుగు అయ్యాయ‌ని మండిప‌డ్డారు....చంద్ర‌బాబు పున్యమా అంటూ రాష్ట్రంలో విచ్చ‌ల విడిగా అవినీతి, అక్ర‌మాలు మాత్రం పెరిగిపోయాయాని అన్నారు.
 
అయితే తాము అధికారంలోకి వ‌చ్చాక విశ్వ‌బ్రాహ్మ‌నుల‌కు కార్పోరేష‌న్ ఏర్పాటు చేస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు... అలాగే ఎన్నిక‌ల్లో పోటీ చేసే ఆర్థిక స్తోమ‌త లేక పోవ‌డంతో విశ్వ‌బ్ర‌హ్మ‌ణుల త‌రపున ఒక ఎమ్మెల్సీ ప‌ద‌విని కేటాయిస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు... దీంతో విశ్వ‌బ్ర‌హ్మ‌ణులు త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు...గ‌డిచిన‌ నాలుగు సంవ‌త్స‌రాల్లో ఏ అధికార నాయ‌కుడు త‌మ‌ను ఇంత ఆప్యాయంగా ప‌లుక‌రించ‌లేద‌ని కానీ జ‌గ‌న్ త‌న సొంత కుటుంబ వ్య‌క్తి లాగా ముట్లాడుతున్నార‌ని హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు... జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే త‌మ బ్ర‌తుకుల బాగుప‌డుతాయ‌ని విశ్వ‌బ్ర‌హ్మ‌ణులు అంటున్నారు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.