జ‌గ‌న్ అదిరిపోయే ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-10 02:00:34

జ‌గ‌న్ అదిరిపోయే ట్వీట్

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర నెల్లూరు జిల్లాలో కొన‌సాగుతోంది.. ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌న‌లో కేంద్రంతో ఏపీ ఎంపీలు పోరాటం చేస్తూనే ఉన్నారు... ఇటు తెలుగుదేశం మాత్రం ఏపీకి కేంద్రం న్యాయం చేసే వ‌రకూ పోరాడుతాం అని చెబుతోంది.. కానీ కేంద్రంలో ఎటువంటి చ‌ల‌నం లేదు.. ఓ ప‌క్క మిత్ర ప‌క్షంగా ఉన్న పార్టీ తీసుకుంటున్న స్టాండ్ చూసి ప్ర‌జ‌లు కూడా నివ్వెర‌పోతున్నారు.
 
తాజాగా వైయ‌స్  జ‌గ‌న్ ఏపీ రాజ‌కీయ ప‌రిస్దితుల‌పై ట్వీట్ పెట్టారు... నైతిక విలువలతో సీఎం చంద్రబాబు నాయుడు  ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఫైర్ అయ్యారు....
 
గ‌తంలో ఏపీని విభజన చేసినప్పుడే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఆ స‌మ‌యంలో పార్ల‌మెంట్ వేదిక‌గా  అప్పటి పాలక, విపక్షాలు కలిసి మాటిచ్చాయి. మార్చి 2014లో ఇదే అంశాన్ని కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. ప్రత్యేక హోదా అమలు అంశాన్ని ప్రణాళికా సంఘానికి కూడా పంపారు. ఏ నైతిక విలువలతో చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు.  ఏమిస్తారో తెలియని ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెడతారా. మీ కంటి తుడుపు చర్యలు ఆపండి. ఏపీ ప్రజలకు ఏం చేశారో చెప్పండి' అని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్విట్‌ చేశారు.
 
దీంతో తెలుగుదేశం నాయ‌కులు డైల‌మాలో ప‌డ్డారు... ఓ ప‌క్క కేంద్రం ఏపీకి సాయం చేస్తోంది అని ఆస్ధాన మీడియా ద్వారా సుచీలీక్స్ కంటే భారీగా లీక్స్ చేస్తున్నారు... మ‌రి ఈ స‌మ‌యంలో ఎటువంటి డెసిష‌న్  సైకిల్ పార్టీ తీసుకుంటుందా  అనేది ఇంకా తెలియాల్సి ఉంది.. వ‌చ్చే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో కూడా మ‌రో లీక్స్ చేసి కాలం వెళ్ల‌దీయాలి అని భావిస్తోంది తెలుగుదేశం పార్టీ అంటున్నారు. వైసీపీ నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.