ముస్లీంల ఆత్మీయ స‌మ్మెళ‌నంలో జ‌గ‌న్ స్పీచ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-07 05:07:09

ముస్లీంల ఆత్మీయ స‌మ్మెళ‌నంలో జ‌గ‌న్ స్పీచ్

రాజ‌కీయం అనే ప‌దానికి నిజ‌మైన అర్ధాలు చెబుతూ ముందుకు సాగుతున్నారు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర‌లో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన ముస్లీంల ఆత్మీయ స‌మావేశంలో పాల్గొన్నారు. 
 
దిల్లీలో ప్ర‌ధాని  న‌రేంద్ర మోదీ హ‌వా పెరిగితే రాష్ట్రంలో చంద్ర‌బాబు మైనారిటీల‌ను మ‌ర‌చిపోతార‌ని, అదే మోదీ హ‌వా త‌గ్గితే అప్పుడు మ‌ర‌లా బాబుకు ముస్లీంలు గుర్తుకు వ‌స్తార‌ని వైయ‌స్ జగ‌న్ ఎద్దేవా చేశారు. రాజ‌కీయాలు కొన‌సాగించాలంటే సిన్సీయారిటీ, నిజాయ‌తీ, విశ్వ‌స‌నీయ‌త కావాలి. ఇవి లేక‌పోతే చంద్ర‌బాబులా త‌యారవుతార‌ని వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. వీటిలో ఏ ఒక్క‌టీ చంద్ర‌బాబుకు లేవ‌ని జగ‌న్ ఆరోపించారు. 
 
బ‌డ్జెట్ అంశం నేప‌ధ్యంలో చంద్ర‌బాబు నాయుడు కేంద్ర ప్ర‌భుత్వం మీద చిట‌ప‌ట అంటూ లీకుల వార్త‌లు  టీడీపీ అనుకూల మీడియా రాయ‌టంపై జ‌గ‌న్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. కేంద్ర ప్రుభుత్వం బ‌డ్జెట్ ప్ర‌వేశ‌ప‌ట్టిన త‌ర్వాత ఒక్క‌సారి కూడా మీడియాతో మాట్లాడ‌లేద‌ని, మాములుగా అయితే రోజుకు రెండు సార్లు మీడియా ముందుకు వ‌చ్చి ప్ర‌జ‌ల‌కు బోరు కొట్టేలా గంట‌లు గంట‌లు మాట్లాడ‌తారు. 
 
కేంద్ర  మంత్రి వ‌ర్గ స‌మావేశం ఆమోదం త‌ర్వాత‌నే  బ‌డ్జెట్ పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ‌పెడ‌తారు..కేంద్ర మంత్రి వ‌ర్గంలో టీడీపీకీ చెందిన మంత్రులు ఉన్నారు... వారు ఆమోదం చెబితేనే క‌దా కేంద్ర బ‌డ్జెట్ ఆమోదం తెలిపేది..మ‌రీ ఇంత దారుణంగా ప్ర‌జ‌ల‌ను చంద్రబాబు మోసం చేస్తున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.