జ‌గ‌న్ ఒక్క‌మాట

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-26 16:29:19

జ‌గ‌న్ ఒక్క‌మాట

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇచ్చిన మాట తీసుకునే నిర్ణ‌యం ఒకే విధంగా ఉంది అని చెప్పాలి.. ముందు నుంచి చెప్పిన విధంగానే జ‌గ‌న్ రాజ‌కీయంగా ముందుకు వెళుతున్నారు... తెలుగుదేశం చేసే ల‌క్ష కోట్లు అనే అప‌వాదులు ప‌క్క‌న పెడితే అవ‌న్ని అవాకులు చ‌వాకులు అని అంద‌రూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు... అస‌లు చంద్ర‌బాబు కోట‌రీ నాయ‌క‌లు అంద‌రూ ల‌చ్చ కోట్లు జ‌గ‌న్ అనే మాట మానేస్తే తెలుగుదేశం కాస్త విక‌సించ‌వ‌చ్చు... అవును 1300 కోట్ల రూపాయ‌ల కేసులు అయితే, అందులో 500 కోట్ల రూపాయ‌ల కేసులు వీగిపోయాయి మిగిలిన‌వి కూడా ఆ జాబితాలో  ఉన్నాయి.
 
అయితే ప్ర‌పంచంలో ఇన్నేవేష‌న్ థాట్స్ అన్ని చంద్ర‌బాబువి అని చెప్పుకునే తెలుగుదేశం మాత్రం, ఈ రాజ‌కీయం కోసం ఏపీ ప‌రువును కేంద్రంలో తాకట్టు పెట్టింది అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.... 2014 లో ప్ర‌తిపక్షం సీట్లో కూర్చున్న జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌త్యేక హూదా అనే మాట పై నిల‌బ‌డ్డారు... కాని చంద్ర‌బాబు మాత్రం ప్ర‌జ‌ల నుంచి వచ్చే వ్య‌తిరేక‌త వైసీపీ చేసే పోరాటాలు కేంద్రం వేసే ఎత్తులు, పావులు బ‌ట్టి త‌న స్ట్రాట‌జీ వేసుకుంటున్నారు.. ఇక్క‌డ పార్టీలు జీవితాంతం ఉండ‌వు ప్ర‌జ‌లే ఉంటారు అనేది బాబు ఆయ‌న పార్టీ గ‌మ‌నించాలి.
 
ప్ర‌త్యేక హూదా కావాలి అని చంద్ర‌బాబు ముందు నుంచి కోరారు. త‌ర్వాత కేంద్రం ప్యాకేజీ ఇస్తాను అంటే ఎస్ ప్యాకేజీ సూప‌ర్,  విఆర్ అ్ర‌గీ ప్యాకేజీ,  సూపర్ ప్ర‌పంచంలోనే అమ‌రావ‌తి బెస్ట్ క్యాపిట‌ల్ కావ‌డానికి ప్యాకేజీ బాగుంది అని తెలియ‌చేశారు.... బాబు మాట‌లు విని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయినా సీనియ‌ర్ క‌దా అని సిన్సియ‌ర్ గా స‌పోర్ట్ చేశారు.. అయితే జ‌గ‌న్ మాత్రం మన‌కు ప్ర‌త్యేక హూదానే కావాలి అని తెలియ‌చేశాడు.
 
చివ‌ర‌కు మ‌ళ్లీ బాబు యూట‌ర్న్ తీసుకుని వెంట‌నే ప్ర‌త్యేక హూదా కావాలి అని మ‌ళ్లీ రివ‌ర్స్ అయ్యారు... దీంతో రాజ‌కీయంగా ఇది పెద్ద వార్ కు తెర‌లేపింది.. కేంద్రం నుంచి బీజేపీ నుంచి ఎన్డీయే నుంచి తెలుగుదేశం విడాకులు తీసుకుంది. అయితే జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం ఒకేలా ఉంది కాని బాబు నాలుగు షేడ్లు  చూపించేస‌రికి బాబుతో మనం ముందుకు వెళ్ల‌లేం అని నిర్ణ‌యించుకున్నారు బీజేపీ నాయ‌కులు... పోతే పొమ్మ‌ని వ‌దిలేశారు అందుకే కేంద్ర‌మంత్రులు రాజీనామా చేసినా ఎటువంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.
 
మొత్తానికి ప్ర‌జ‌లు అంద‌రూ గుర్తించింది ఇదే , జ‌గ‌న్ నాటి నుంచి నేటి వ‌ర‌కూ అదే విధానంలో ఉన్నారు... బాబు మాత్రం యూట‌ర్న్ లు ట‌ర్నింగ్ లు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. అందుకే ఈ విమ‌ర్శ‌లు కూడా ఆగ‌డం లేదు. మ‌రి బాబు ఎప్పుడు ట‌ర్నింగ్ లు ఆపుతారో చూడాలి.
 
విశ్లేష‌ణ !! గ‌ణేష్ .వి

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.