జ‌గ‌న్ కు అది మ‌రింత ప్ల‌స్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-10 03:09:46

జ‌గ‌న్ కు అది మ‌రింత ప్ల‌స్ ?

జన ప్రవాహంతో జాతరలా సాగుతోంది వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ ముందుకు క‌దులుతున్నారు జ‌గ‌న్....... ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ  ప్రజావ్య‌తిరేక‌ ప్రభుత్వం పై  సమరభేరి మోగిస్తున్నారు వైయ‌స్ జ‌గ‌న్.
 
రాయలసీమ నాలుగు జిల్లాల్లో జ‌గ‌న్ పాద‌యాత్ర పూర్తి చేసుకుని, కోస్తా ప్రాంతం నెల్లూరులో అడుగుపెట్టారు..ఆయ‌న‌కు అక్క‌డ కూడా జ‌నం నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు.. ఎంత అంటే రాయ‌ల‌సీమ ప్రాంతం కంటే మెండుగా..
జగన్ పాదయాత్ర చేస్తూ పార్టీపై ఒకింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
 
మ‌రో  వారంలో జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌కాశం జిల్లాలోకి ప్ర‌వేశించ‌నుంది.. ఇక ఫిరాయింపు సెగ్మెంట్ల పై కూడా జ‌గ‌న్ కొత్త పందాలో వ్యూహాత్మ‌కంగా వ్య‌వహారిస్తున్నారు.. ఆయా సెగ్మెంట్ల‌లో జ‌గ‌న్ త‌న స్పీచ్ తో అద‌ర‌గొడుతూ ప్ర‌భుత్వం పై విమ‌ర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు.. ఏపీకి ఎటువంటి డ‌వ‌ల‌ప్ మెంట్ ఈ నాలుగు సంవ‌త్స‌రాల‌లో జ‌ర‌గ‌లేదు అనేది జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు తెలిసేలా చేస్తున్నారు.
 
ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర పూర్తి అయిన చోట, ప్ర‌శాంత్ కిషోర్ టీం అక్కడ ప్ర‌జ‌ల ప‌ల్స్ తెలుసుకుంటోంది.. స‌ర్కారు పై ఏఏ విష‌యాల్లో వారు వ్య‌తిరేక‌త చూపుతున్నారో తెలుసుకుంటోంది. అలాగే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రికి టికెట్ ఇవ్వాలి ఏ నాయ‌కుడు ప్ర‌జ‌ల్లో మెలుగుతున్నారు అనే దారిలో స‌ర్వేలు చేయిస్తున్నారు.
 
ఇక పాదయాత్రలో భాగంగా తనను కలిసిన కార్యకర్తల నుంచి సల‌హాలు తీసుకుంటూ, న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేస్తున్నారు.. అలాగే వారు చెప్పే వాటిని వింటూ మేనిఫెస్టో రూప‌క‌ల్ప‌న‌కు వాటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటాన‌ని చెబుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.