అదే టార్గెట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-11 12:38:55

అదే టార్గెట్

వైసీపీ అధినేత జ‌గన్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్రతో  తొలి నుంచి గ్రామాల్లో  ప్ర‌జ‌ల‌కు బాగా ద‌గ్గ‌ర అవుతున్నారు... మ‌రీ ముఖ్యంగా రూరల్ - అర్బ‌న్ ప్రాంతాల ప్ర‌జ‌ల నుంచి   మంచి ప్ర‌జాధ‌ర‌ణ ల‌భిస్తోంది... ముఖ్యంగా జ‌గ‌న్ పాద‌యాత్ర గ్రామాల్లో నుంచి వెళ్ల‌డం అలాగే రూర‌ల్ ప్రాంతాల స‌మ‌స్య‌లు చూడ‌టం, ప్ర‌జ‌ల నుంచి అర్జీల‌ను తీసుకోవ‌డం దానిపై అక్క‌డ నేత‌ల‌తో మాట్లాడ‌టం, ఇవ‌న్ని ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్ కు మ‌రింత మంచి ఉద్దేశ్యాన్ని క‌ల్పిస్తున్నాయి.. అలాగే న‌మ్మ‌కాన్ని కూడా క‌లిగిస్తున్నాయి.
 
ప‌ల్లెల‌ను త‌క్కువ‌గా చూడ‌కూడ‌దు అంటారు నిజ‌మే...పల్లెలే దేశానికి. పట్టుకొమ్మలు, గ్రామాలు అభివృద్ధి. చెందినప్పుడే దేశం అభివృద్ధి. చెందుతుంది అంటూ రాజకీయ. నాయకుల ఉపన్యాసాలు. వింటుంటాం కాని పాటించేది చాలా త‌క్కువ మంది అయితే జ‌గ‌న్ ప్ర‌సంగాలు జ‌గ‌న్ తీరు చూస్తుంటే ప‌ల్లెల్లో కొత్త మార్పులు తెచ్చే దిశ‌గా వెళ్ల‌నున్నారు.
 
ముఖ్యంగా రైతుల ఓటు బ్యాంకు ఏ పార్టీ వైపు ఉంటే ఆ పార్టీవైపు ప్ర‌జ‌లు మ‌రింత మ‌ద్ద‌తు తెలుపుతారు... నాడు కాంగ్రెస్ యూపీఏ 1 రైతు హామీలతోనే విజ‌యాన్ని సుల‌భంగా త‌మ ఖాతాలో వేసుకుంది... త‌ర్వాత ప‌లు రాష్ట్రాల్లో సీఎంలు ఏది అడిగితే అదిచేయ‌డం రైతుల‌కు ఉపాధిహామీ ప‌థ‌కం ఇలా ప‌లు ఆక‌ర్ష‌ణ ప‌థ‌కాల‌తో రెండోసారి అధికారంలోకి వ‌చ్చింది... అయితే 60 శాతం జ‌నాభా ఉన్న రూర‌ల్ అలాగే గ్రామాల్లో జ‌గ‌న్ త‌న స్ట్రాట‌జీ చూపుతున్నారు వ‌చ్చే ఎన్నిక‌ల కోసం.
 
జ‌గ‌న్ ఎక్క‌డ గ్రామాల్లో స్పీచ్ అయినా త‌న ప్ర‌ణాళిక తెలియ‌చేస్తున్నారు... అస‌లు మ‌ద్య‌పాన నిషేదం అనే స‌రికి జ‌గ‌న్ కు మ‌రింత ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు వ‌చ్చింది... వ‌చ్చే రోజుల్లో ద‌శ‌ల‌వారీగా మ‌ద్య‌పాన నిషేధం అని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు..  అలాగే ముందుకు వెళ్ల‌తారు అని ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారు....అలాగే గ్రామ సచివాలయం వంటి కార్యక్రమాలు గురించి ఎక్కువగా వివరిస్తున్నారు ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ .. ప్ర‌భుత్వ కార్యాల‌యాల చుట్టూ తిరిగి త‌మ‌కు కావ‌ల‌సిన  ప‌థ‌కాల కోసం అర్జీలు పెట్టుకుని కాళ్ల‌రిగేలా తిరిగే ప‌రిస్దితి రాకుండా చేస్తాన‌ని.. గ్రామంలోనే సచివాలయం ఏర్పాటుచేసి సమస్య అక్కడే 24 గంటలలోగా పరిష్కారమయ్యేలా తీసుకుంటామని తెలిపారు జ‌గ‌న్. 
 
గ్రామాల్లో అంగ‌న్ వాడీల స‌మ‌స్య‌ల‌పై కూడా జ‌గ‌న్ గ‌ళం విప్పారు... ప్ర‌భుత్వం తెలంగాణ‌లో అంగ‌న్ వాడీలకు చెల్లించే వేత‌నాలు ఇక్క‌డ ఏపీ చెల్లించే వేత‌నాలు గురించి వారు జ‌గ‌న్ కు వివ‌రించారు... మూడు నెల‌ల‌లుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయి అని వారు వాపోయారు... మొత్తానికి గ్రామాల్లో ఉండే స‌మ‌స్య‌ల నుంచి ప్ర‌క్షాళ‌న మొద‌లుపెట్టే దిశ‌గా జ‌గ‌న్ ముందుకు వెళుతున్నారు అంటున్నారు వైసీపీ నాయ‌కులు ప్ర‌జ‌లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.