జ‌గ‌న్ అది ఖ‌చ్చితంగా నెర‌వేర్చుతారు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-03 06:16:08

జ‌గ‌న్ అది ఖ‌చ్చితంగా నెర‌వేర్చుతారు

ప్ర‌తిప‌క్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కాపుల విష‌యంలో యూట‌ర్న్ తీసుకోలేద‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు. ఈ రోజు పార్టీ కార్యాలాయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ 2019లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కాపు కుల‌స్తులు అభివృద్ది కోసం జ‌గ‌న్ ప‌దివేల కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించారని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.
 
అయితే త‌మ నాయకుడు ప్ర‌క‌టించిన హామీని త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు టీడీపీ నాయ‌కులు అనేక ఎత్తుగ‌డ‌లు వేస్తున్నార‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆరోపించారు. కాపుల విష‌యంలో త‌మ నాయ‌కుడు యూట‌ర్న్ తీసుకోలేద‌ని నాలుగు సంవ‌త్స‌రాల నుంచి ఎవ‌రు యూట‌ర్న్ తీసుకున్నారో ప్ర‌జ‌లు తెలుస‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 
 
జ‌గ‌న్ ఏదైన హామీ ఇస్తే మాట త‌ప్ప‌ర‌ని అధికారంలోకి రాగానే కాపు కార్పోరేష‌న్ కింద ఖ‌చ్చితంగా 10వేల కోట్ల నిధులను  కేటాయిస్తార‌ని ఆయ‌న స్పష్టం చేశారు. కాపు రిజ‌ర్వేన్ల అంశం అన్న‌ది కోర్టు ప‌రిధిలోనిది క‌నుక ఆ విష‌యాన్ని జ‌గ‌న్ దృష్టిలో ఉంచుకుని మొన్న జ‌గ్గంపేట‌లో మాట్లాడార‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.