చంద్ర‌బాబు దానికి మీరే కార‌ణం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-04 15:44:34

చంద్ర‌బాబు దానికి మీరే కార‌ణం

మాన‌వ‌త్వానికే మ‌చ్చ తెచ్చే ఘ‌ట‌న గుంటూరు జిల్లా దాచేప‌ల్లిలో  నిన్న చోటు చేసుకుంది... ముక్కు ప‌చ్చ‌లార‌ని తొమ్మిదేళ్ల బాలిక‌పై 55 సంవ‌త్స‌రాలు క‌లిగిన ఓ వృద్దుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు... ఈ ఘోర సంఘ‌ట‌న రాష్ట్రాన్నే కుదిపేసింది.... అయితే ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌తిక్షాలు, వామ‌క్షాలు తీవ్రంగా మండిప‌డుతున్నాయి... రాష్ట్రంలో ఎప్పుడూ జ‌రగ‌ని విధంగా తెలుగుదేశం పార్టీ హయాంలో జ‌రుగుతున్నాయ‌ని ఆరోపిస్తున్నారు...
 
చంద్ర‌బాబు పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతుంద‌ని అంటున్నారు.. ఇక దీంతో పాటు కాల్‌మనీ సెక్స్‌ రాకెట్ వ్య‌వ‌హ‌రంలో టీడీపీ నాయ‌కుల హ‌స్తం ఉంది కాబ‌ట్టే  చంద్ర‌బాబు ఈ విష‌యంపై చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని  వామ‌ప‌క్షాలు మండిప‌డుతున్నాయి.
 
ఇక తాజాగా దాచేప‌ల్లి ఘ‌ట‌న‌పై ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా స్పందించారు... దాచేప‌ల్లి లో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుదే బాధ్య‌త అని జ‌గ‌న్ ట్వీట్ట‌ర్ లో పేర్కొన్నారు...చిన్నారి పై జ‌రిగిన అత్యాచారంపై జ‌గ‌న్ త‌న దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు.
 
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చాక మ‌హిళ‌ల‌పై హత్యాచారాలు, మానంభంగాలు విప‌రీతంగా పెరిగి పోతున్నాయని జ‌గ‌న్ అన్నారు... మొన్న కాల్ మ‌నీ, నిన్న సెక్స్ రాకెట్, ఈ రోజు తొమ్మిదేళ్ల బాలిక పై  55 సంవ‌త్స‌రాల  వృద్దుడు అత్యాచారం చేయ‌డం దారుణం అని జ‌గ‌న్ అన్నారు... అయితే ఇదంతా చంద్ర‌బాబు వైఖ‌రి వల్లే  ఇటువంటి సంఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయ‌ని జ‌గ‌న్ ట్విట్ట‌ర్  లో తెలిపారు.
 
మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, దౌర్జ‌న్యాలు ఎక్కువ అవుతున్నాయ‌ని,  ఈ  ఘ‌ట‌న‌లకు మీరు కాదా కార‌ణం! అని చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు... ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్న దుండగుల్లో ఎక్కువగా టీడీపీ నేతలు , ఆ పార్టీకి చెందిన వారే ఉండటం వల్ల ఇలాంటి నేరాలు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయ‌ని జ‌గ‌న్  ట్వీట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు... కూత కుస్తే వినిపించేంత దూరంలో ఈ ఘ‌ట‌న జ‌రిగితే అధికారులు ఎందుకు స్పందంచ‌లేద‌ని జ‌గ‌న్ ట్విట్ట‌ర్  ద్వారా పేర్కొన్నారు.
 
ఇక జ‌గ‌న్ త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్రకు అడుగ‌డుగునా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.. ఈ సంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతోంది... ప్ర‌జా సమ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ, వైసీపీ అధికారంలోకి వ‌స్తే ప్ర‌తీ ఒక్క‌రిని ఆదుకుంటామ‌ని భ‌రోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.