జ‌గ‌న్ ట్వీట్ అద‌ర‌హో

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan image
Updated:  2018-03-13 11:01:36

జ‌గ‌న్ ట్వీట్ అద‌ర‌హో

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 8 సంవ‌త్స‌రాలు  అయిన సంద‌ర్బంగా పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పార్టీ కొసం నిరంత‌రం ప‌నిచేస్తున్న కార్య‌క‌ర్త‌ల‌కు,  పార్టీ పై ఆదరాభిమానాలు చూపిస్తున్న ప్రజలకు  ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఇదే రోజు విలువలతో కూడిన రాజకీయాలను ప్ర‌జ‌ల‌కు అంకితం చేయ‌డానికి మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పురుడు పోసుకుందని తెలిపారు వైయ‌స్ జ‌గ‌న్.
 
ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హక్కుల సాధన కోసం అండగా నిలుస్తూ పోరాడుతూ రాజన్న రాజ్యాన్ని తిరిగి తెస్తామ‌ని తెలిపారు. వైయ‌స్ఆర్ ఆశయాలను సాధించ‌డానికి కార్యకర్తలు చేస్తున్న ప్ర‌య‌త్నం, పార్టీ పట్ల వారి విధేయతకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మద్దతు తెలుపుతున్న ఆంధ్ర ప్రజలకు నా కృతజ్ఞతలు అంటూ  వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌ చేశారు. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.