జగన్ ఒక మెట్టు పైకి...చంద్రబాబు ఒక మెట్టు కిందకి..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan babu image
Updated:  2018-03-04 05:56:33

జగన్ ఒక మెట్టు పైకి...చంద్రబాబు ఒక మెట్టు కిందకి..

చంద్రబాబు... 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం అయన సొంతం...అయన తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూసివుంటారు.. 36 ఏళ్ల రాజకీయం ఒక ఎత్తు అయితే ఈ నాలుగేళ్ళ రాజకీయం మరో ఎత్తు..ఈ నాలుగేళ్ళ కాలంలో చంద్రబాబు తన ప్రతిష్టాత్మక తన మాటల ద్వారా ఎంతో కొంత తానే దిగజార్చుకున్నారు..
 
ఒలింపిక్స్ ని ఆంధ్రప్రదేశ్ కి తీసుకువస్తా, టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసింది నేనే అని, అలాగే సైనా ని బాడ్మింటన్ నేర్చుకోమని చెప్పింది నేనే అని  ఇందిరా గాంధీతో చెప్పి రాజశేఖర్ రెడ్డికి సీటు ఇప్పించింది నేనే ఇలా చెప్పుకుంటూ పొతే కొన్ని వందలు ఉంటాయి. ఇలాంటి మాటలు విన్న ప్రతిసారి కొంత మంది నవ్వుకుంటుంటే, మరి కొంత మంది చంద్రబాబుకి ఏమైంది, ఇలా మాట్లాడుతున్నారని అని విచారిస్తున్నారు...అయితే  మరి కొంత మంది చంద్రబాబు చెప్పిన మాటలను ఉపయోగించి టీడీపీ అభిమానులపై సెటైర్లు వేస్తున్నారు.
 
దీంతో ఆగకుండా ప్రతి సమస్యపైనా ఈరోజు ఒకటి.... రేపు ఒకటి మాత్లడుతూ.... రెండు నాలుకలా ధోరణిని బయటపెడుతున్నారు చంద్రబాబు.. ఉదాహరణకు 2014 ఎన్నికల్లో భేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పారు...ఆ తర్వాత నేను ఆలా చెప్పలేదు, మీరు కల ఏమైనా కన్నారా అన్నారు...ప్రత్యేక హోదాని తీసుకుంటే 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు కావాలి అన్నారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఏమైనా సంజీవన అన్నారు..ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఒక్కటే అనుకున్నాను ప్యాకేజీ వద్దు హోదానే కావాలి అంటున్నారు...ఇలా పూటకో మాట చెప్పి ప్రజలను మోసం చేస్తున్న అనుకుంటున్నారు...కానీ ఇలా మాట్లాడి అయన మైలేజిని ఆయనే తగ్గించుకొని ప్రజల దగ్గర అబాసుపాలవుతున్నారు.
 
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో యువ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చారు జగన్ ...ఆ తర్వాత జరిగిన ఊహించని రాజకీయ పరిణామాలతో అతి కొద్దీ కాలంలోనే ఎనో ఎత్తు పల్లాలను చవి చూసారు ... ఢిల్లీ అహంకారాన్ని ఎదురించి పార్టీ స్థాపించి ఎన్నికలకి వెళ్లి ప్రతిపక్ష నాయకుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.
 
అసెంబ్లీలో ఏ విషయం అయినా సరే ఆధారాలతో సమగ్రంగా మాట్లాడంతో అందరి దృష్టిలో పడ్డారు జగన్..అయన మాట్లాడే విధానం నచ్చి కొందరు టీడీపీ నేతలు సైతం ప్రశంసించారు..ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ ని అసెంబ్లీ ఒక మెట్టు పైకి ఎక్కించిందనే చెప్పుకోవాలి... పాదయాత్ర చేస్తున్న ఈ మూడు నెలల కాలంలోనే జగన్ లో చాల మార్పు వచ్చింది...పాదయాత్ర సమయంలో జరిగే భారీ బహిరంగ సభ సమయంలో పదునైన వ్యాఖ్యలతో, పదునైన పంచ్ లతో ప్రజల్ని కట్టిపడేస్తున్నారు...జగన్ మాట్లాడే విధానాన్ని టీడీపీ నేతలు సైతం చర్చించుకుంటున్నారు...పాదయాత్ర కూడా జగన్ కి మరింత మైలేజ్ తీసుకువచ్చిందనే చెప్పాలి..
 
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాలుగు సంవత్సరాల నుండి తన మాటలతో, చేతలతో ఒక అడుగు కిందకు దిగుతుంటే...రాజన్న వారసుడిగా అడుగుపెట్టిన జగన్ ఎప్పటికప్పుడు తనని తాను మార్చుకుంటూ, తన ఆలోచన విధానాన్ని సైతం మార్చుకుంటూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటూ ఒక మెట్టు పైకి ఎక్కి యువనేతగా ముందుకు సాగుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.