వైఎస్ రాజారెడ్డి పాత్ర‌లో ఆ హీరోనే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysr bio pic
Updated:  2018-07-02 17:08:46

వైఎస్ రాజారెడ్డి పాత్ర‌లో ఆ హీరోనే

ఇటు టాలీవుడ్ లో చూసినా  అటు బాలీవుడ్ లో చూసినా కొద్ది కాలంగా బ‌యోపిక్ ల హవా ఏ రేంజ్ లో కొన‌సాగుతుందో మ‌నంద‌రికీ తెలిసిందే. అయితే మొద‌టిగా మాజీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క రామారావు బ‌యోపిక్ ను తెలుగు చిత్ర‌పరిశ్ర‌మ‌కు చెందిన‌ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు తెర‌కెక్కిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే.అందులో మొద‌టిగా విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ల‌క్ష్మిస్ అనే టైటిల్ తో తెర‌కెక్కిస్తున్నారు.ఇక మ‌రో ద‌ర్శ‌కుడు క్రిష్ ఎన్టీఆర్ అనే టైటీల్‌ తో మ‌రో చిత్రాన్నితెర‌కెక్కిస్తున్నారు.ఈ చిత్రంలో నంద‌మూరి బాల‌కృష్ణ త‌న తండ్రి పాత్ర‌లో న‌టిస్తున్నారు.
 
ఇదే క్ర‌మంలో మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త‌నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత క‌థ‌ను ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు  వి.ర‌ఘవ్ తెర‌కెక్కిస్తున్నారు. వాస్త‌వంగా చెప్పాలంటే ఈ చిత్రానికి పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాలి కానీ ఆయ‌న చేతిలో ఎక్కువ ప్రాజెక్టులు ఉండ‌టంతో వైఎస్ బ‌యోపిక్ ద‌ర్శ‌క‌ బాధ్య‌త‌ల‌ను ర‌ఘ‌వ్ తీసుకున్నారు. అయితే ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి యాత్ర అనే టైటిట్ రిలీస్ చేసి ఇటీవ‌లే ఒక పోస్ట‌ర్ ను కూడా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 
 
ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పాత్ర‌లు రెడి చేసింది చిత్ర యూనిట్. అందులో వైఎస్ ప్ర‌ధాన పాత్ర‌లో మ‌ళ‌యాల న‌టుడు ముమ్మ‌ట్టి, అలాగే విజ‌య‌మ్మ పాత్ర‌లో ఆశ్రిత పొన్నగంటి న‌టిస్తోంది. ఇక‌ వైఎస్ జ‌గ‌న్  మోహ‌న్ రెడ్డి పాత్ర‌లో హీరో సూర్య న‌టిస్తున్నారు. అలాగే వైఎస్ శ‌ర్మిల పాత్ర‌లో హీరోయిన్ భూమిక న‌టిస్తున్నార‌ట‌. ఇక వైఎస్ అనుచ‌రుడు సూరీడు పాత్ర‌లో పోసాని కృష్ణ ముర‌ళీ న‌టిస్తున్నారు. అలాగే వైఎస్ హ‌యాంలో హోమంత్రిగా ప‌నిచేసిన స‌బితా ఇంద్రారెడ్డి పాత్ర‌లో  సీనియ‌ర్ న‌టి సుహాసిని న‌టిస్తున్నారు. 
 
ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి తండ్రి రాజా రెడ్డి పాత్ర‌లో జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. రాజారెడ్డి బ్ర‌తికున్న స‌మ‌యంలో రాజ‌కీయంగా ఎలా ఎదిగారు పార్టీ త‌ర‌పున ఎలాంటి ప‌ద‌వుల‌ను ఆశించకుండా ప్ర‌జా సేవ ఎలా చేశార‌నే విష‌యాల‌ను వైఎస్ బ‌యోపిక్ లో చిత్రీక‌రించ‌నున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.