జ‌క్కంపూడి పార్టీ మార‌డంపై క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-20 18:41:03

జ‌క్కంపూడి పార్టీ మార‌డంపై క్లారిటీ

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్రకు ప్ర‌తీ జిల్లాలో ఇసుక‌వేస్తే రాలనంత జ‌నాలు హాజ‌రై జ‌న‌నేత‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. గ‌తంలో క‌డ‌ప జిల్లాలో జ‌గ‌న్ కు ఏ విధంగా ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలిపారో..ప్ర‌స్తుతం ఆ జిల్లాను త‌ల‌ద‌న్నే విధంగా ప్ర‌జ‌లు పాద‌యాత్ర‌కు హాజ‌రై జ‌న‌నేత జ‌గన్ కు అధిక సంఖ్యలో మద్ద‌తు తెలుపుతున్నారు.ముఖ్యంగా గ‌మ‌నించిన‌ట్లయితే ఉభ‌య గోదావ‌రి జిల్లా ప్ర‌జ‌లు, యువ‌త పెద్దఎత్తున జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అడుగులో అడుగులు వేస్తూ ఆయ‌న వెంట న‌డుస్తున్నారు. 
 
ఇక తాజాగా ఈ రెండు జిల్లాల్లో ఓ వార్త వైర‌ల్ అవుతోంది. చాలా కాలంగా వైసీపీలో ఉంటూ, జ‌గ‌న్ వెన్నంటి న‌డుస్తున్న‌ జ‌క్కంపూడి కుటుంబం మ‌రికొద్ది రోజుల్లో వైసీపీని వీడ‌నుంద‌ని, అలాగే రాజా కూడా వైసీపీకీ గుడ్ బై చెబుతున్నారని ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ఈ వార్త కోడై కూస్తోంది. ఇదే జిల్లాలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా పాద‌యాత్ర చేస్తుండ‌టంతో ఈ న్యూస్ ఇంకా హాట్ హాట్ గా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ వార్త‌ల‌పై ఎట్ట‌కేల‌కు జ‌క్కంపూడి కుటుంబం స్పందించింది.
 
తాము ఎట్టి ప‌రిస్థితుల్లో వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌మ‌ని త‌మ‌పై వస్తున్న వార్త‌ల్లో ఎలాంటి వాస్త‌వం లేద‌ని, తాము చివ‌రి వ‌ర‌కు వైసీపీలోనే ఉంటామ‌ని జ‌క్కంపూడి రాజా స్ప‌ష్టం చేశారు. చిన్న‌చిన్న కార‌ణాల వ‌ల్ల తాము ప‌క్క‌కుపోయో అవ‌కాశం లేద‌ని అన్నారు. ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ ఈ నెల 12 వ తేదీన రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో వ‌చ్చిన సంద‌ర్భంగా త‌న పేరు ప్ర‌స్తావించ‌క‌పోవ‌డంతో త‌న‌కు గిట్ట‌నివారు అబ‌ద్ద‌పు ప్ర‌చారం చేస్తున్నార‌ని అన్నారు.
 
అయితే ఇలాంటి ఫేక్ న్యూస్‌ల‌ను ప్ర‌జ‌లు పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌సరంలేద‌ని స్ప‌ష్టం చేశారు రాజా. జ‌గ‌న్ త‌మ జిల్లాకు వ‌స్తున్నార‌నే నేప‌థ్యంలో సుమారు 20 రోజులు శ్ర‌మించామ‌ని అన్నారు. గ‌తంలో సీఎం వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి  దివంగత జ‌క్కంపూడి రామ్మోహనరావు ఏ విధంగా ఘనస్వాగతం పలికారో, అంత‌కంటే ప‌ది రెట్లు ఎక్కువ‌గా జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ఘ‌నస్వాగ‌తం ప‌లికామ‌ని జ‌క్కంపూడి రాజా స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.