ప‌వ‌న్ కు జ‌లీల్ ఖాన్ సంచ‌ల‌న స‌వాల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-15 17:14:05

ప‌వ‌న్ కు జ‌లీల్ ఖాన్ సంచ‌ల‌న స‌వాల్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న పార్టీ ఆవిర్బావ దినోత్స‌వం సంద‌ర్భంగా, గుంటూరులో ప్లీన‌రీ వేదిక‌గా చేసుకుని అధికార తెలుగు దేశం నాయ‌కుల‌పై దుమ్మెత్తి పోశారు ప‌వ‌న్...  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న పార్టీ ఎమ్మెల్యేలు అధికార అండ చూసుకుని రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ప్లీన‌రీ సాక్షిగా బ‌ట్టబ‌యలు చేశారు జ‌న‌సేన అధినేత.
 
అందులో భాగంగానే విజ‌య‌వాడ ఎమ్మెల్యే,  బీకాం లో ఫిజిక్స్ జ‌లిల్ ఖాన్ పై కూడా మండిప‌డ్డారు ప‌వ‌న్... అధికారం అండ‌తో విజ‌య‌వాడలో దుర్గ గుడికి వ‌స్తున్న భ‌క్తుల‌పై డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నార‌ని ప‌వ‌న్ అన్నారు... అయితే ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించారు జ‌లిల్ ఖాన్...ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తాను దుర్గ గుడి ద‌గ్గ‌ర భ‌క్తుల ద‌గ్గ‌ర నుంచి డ‌బ్బులు తీసుకున్న‌ట్లు ప‌వ‌న్ క‌ల్యాణ్ నిరూపిస్తే తాను రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని ప‌వ‌న్ కు స‌వాల్ విసిరారు జ‌లీల్.
 
ప‌వ‌న్  స‌భ పెడుతున్నారంటే ప్ర‌త్యేక హోదాపైన గ‌ట్టి పోరాటం చేస్తున్నార‌ని భావించి ఈ స‌భ‌కు రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు వ‌చ్చార‌ని అన్నారు... కానీ అస‌లు విష‌యాన్ని మ‌రిచిపోయి, లేనిపోని ఆరోప‌ణ‌ల‌ను టీడీపీ నాయ‌కుల‌పై చేస్తున్నార‌ని అన్నారు... ఈ స‌భ‌లో ప్ర‌త్యేక హోదాపై ప‌వ‌న్ ఒక్క‌మాట అయినా మాట్లాడారా! ఈ విష‌యంలో ప్ర‌ధాన మంత్రి మోడీని ప్ర‌శ్నించారా అని ప‌వ‌న్ పై మండిప‌డ్డారు జ‌లీల్ ఖాన్... నరేంద్రమోడీ, జగన్‌మోహన్‌రెడ్డి, పవన్ కల్యాణ్ కలిసొచ్చినా తెలుగుదేశం పార్టీని కానీ, త‌మ నాయ‌కుడు చంద్ర‌బాబు ను  ఏమీ చేయ‌లేర‌ని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.