జగన్ కాళ్ళు పట్టుకుంటా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-13 17:02:30

జగన్ కాళ్ళు పట్టుకుంటా

బీకాం ఫిజిక్స్ ప్ర‌పంచ‌కంలో అంటూ సంచ‌ల‌నాలు అంచ‌ల‌నాలు తిర‌గ‌రాశారు ఎమ్మెల్యేజ‌లీల్ ఖాన్ పార్టీ ఫిరాయింపులు ప‌క్క‌న పెడితే దాని కంటే ఎక్కువ‌గా బీకాం  ఫిజిక్స్ తో  సంచ‌ల‌నాలు క్రియేట్ చేశారు.. అయితే మంచో చెడో దీంతో  పేరు తెచ్చుకున్నారు జ‌లీల్... ఇక సోష‌ల్ మీడియాలో కూడా అది హైలెట్ అయింది.. ఇక ఆయన పార్టీ ఫిరాయింపుల‌పై ఎప్పుడూ ఒకే మాట మాట్లాడ‌తారు... చంద్ర‌బాబు విజ‌న్ చూసి పార్టీ మారాము అని అంటారు.. జ‌గ‌న్ తో అందుకే ఉండ‌లేక‌పార్టీ మారాము అంటారు... అయితే జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేయ‌డం ష‌రా మామూలే తాజాగా జ‌లీల్ ఖాన్ మ‌ళ్లీ  జ‌గన్ పై ఫైర్ అయ్యారు.
 
ప్రధానమంత్రి నరేంద్రమోడీని జగన్ విమర్శించగలిగితే నేను జగన్ కాళ్ళు పట్టుకుంటానని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.....పరిపాలన చేతగాక దద్దమ్మలా మోదీ దీక్ష చేసారని, పార్లమెంటును సజావుగా నడిపించలేని నరేంద్రమోదీ రాజీనామా చేయాలన్నారు. దళితులు, మైనార్టీల మీద దాడులు చేస్తున్నా కేంద్రం చోద్యం చూస్తోందన్నారు. చంద్రబాబునాయుడు బాధ్యతగల వ్యక్తి కాబట్టి నాలుగేళ్లు ఓపిక పట్టారని, మరి ప్రతిపక్ష నేతగా జగన్ నాలుగేళ్లు ఏమి చేశాడో చెప్పాలన్నారు. 
 
మొత్తానికి పార్టీలో ఉన్నంత సేపూ జ‌లీల్ ఖాన్ ఇటువంటి ప్ర‌త్యేక హూదా ఉద్య‌మంలో ఎంత క‌ష్ట‌ప‌డ్డారో తెలిసిందే ఇప్పుడు చంద్ర‌బాబు పాల‌న న‌చ్చి సైకిల్ ఎక్కిన జ‌లీల్ తెలుగుదేశం ఎందుకు యూట‌ర్న్ తీసుకుంటుందో అడ‌గాల‌ని, జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేసే జ‌లీల్ ప‌వ‌న్ చేసిన అవినీతి ఆరోప‌ణ‌ల‌పై మీ పార్టీని చర్చ‌కు సీబీఐ ఎంక్వైరీకి రెడీ అవ్వాలి అని చెప్ప‌గ‌లరా?  జ‌గ‌న్ ఎన్ని పోరాటాలు చేసినా మీరు చెవులు పువ్వులు పెట్టుకొని చేసిన నిర‌స‌న‌లే గొప్ప అని చెబుతారు. సైకిల్ తొక్కి చెవులో పువ్వులు పెట్టుకుంటే ప్ర‌త్యేక హూదా వ‌స్తుందా త‌మ్ముళ్లు అని  మ‌రోసారి అడుగున్నారు వైసీపీ నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.