జఫ్ఫాల మాదిరి మాట్లాడుతున్నారు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-23 11:14:55

జఫ్ఫాల మాదిరి మాట్లాడుతున్నారు

విజ‌య‌వాడ ఫిరాయింపు ఎమ్మెల్యే, బీకాంలో ఫిజిక్స్‌, జ‌లీల్ ఖాన్ ఎంత ఫేమ‌స్ అయ్యారో మ‌నంద‌రికీ తెలిసిన విష‌య‌మే....ఇక తాజాగా జ‌లీల్ ఖాన్ త‌న‌ వాక్చాతుర్యంతో మ‌రోసారి మీడియా ముందు రెచ్చిపోయారు... ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రం కోసం త‌న వ‌య‌సుకు సాధ్యం కాని కార్య‌క్ర‌మాలు చేస్తుంటే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ బుర‌ద జ‌ల్లుతున్నార‌ని మండిప‌డ్డారు...ఆయ‌న‌ కుమారుడు ఏపీ మంత్రి లోకేశ్ రాజ‌కీయంలో ఎదుగుద‌ల‌ను చూసి స‌హించ‌లేక ఇలాంటి కుట్ర‌లకు పాల్ప‌డుతున్నార‌ని జ‌లీల్ ఖాన్ ఆరోపించారు.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. 2014 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తు తెలిపిన‌ ఆయ‌న.. మొన్న‌టిదాక‌ చంద్ర‌బాబును అలాగే లోకేశ్ ను విచ్చ‌ల‌విడిగా మీడియా స‌మ‌క్షంలో పోగిడార‌ని గుర్తుచేశారు... కానీ ఇప్ప‌టికిప్పుడు ప్లేటు ఫిరాయించి చంద్రబాబు అవినీతి ప‌రుడ‌ని విమ‌ర్శ‌లు చేయ‌డం ఎంత‌వ‌ర‌కు క‌రెక్టొ తెలుసుకోవాల‌ని జ‌లీల్ ఖాన్ ఆరోపించారు.
 
 
అందులో భాంగంగానే సీఎం సమక్షంలో హిందుపూరం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్య‌ల‌లో ఎలాంటి తప్పులేదని వెన‌కేసుకొచ్చారు జ‌లీల్... ఈ విషయంలో బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు... బీజేపీ రాష్ట్రానికి చేసిన మోసాన్ని మాత్ర‌మే బాల‌కృష్ణ ప్ర‌స్తావించారని తెలిపారు... అలాగే ఎవ‌రికైనా మోడీ చేసిన అన్యాయంపై మాట్లాడే దమ్ముందా అని ప్రశ్నించారు. మోడీకంటే చంద్రబాబుది సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర అని, దమ్ము, ధైర్యంలో బాబును మించినవారు లేరని జలీల్‌ ఖాన్‌ చెప్పుకొచ్చారు.
 
 
ప్రస్తుత ప్రజాస్వామ్యంలో ఇలాంటి విధానాలు అసలు మనలేవని, గతంలో చిరంజీవి చేసినట్లే పవన్‌ కాపులను మోసం చేస్తున్నారు’ అని జలీల్‌ ఖాన్‌ అన్నారు...దీంతో పాటు చంద్రబాబుపై బీజేపీ నేతలు జఫ్ఫాల మాదిరి మాట్లాడుతున్నార’ని విచిత్ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు..గ‌తంలో వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి చంద్ర‌బాబు పై చేసిన వ్యాఖ్య‌లు విమ‌ర్శించిన టీడీపీ ఇప్పుడు జ‌లీల్ ఖాన్ చేసిన వ్యాఖ్య‌ల‌పై అదిష్టానం ఎలా స్పందిస్తాదో వేచిచూడాలి. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.