జ‌లీల్ స‌వాల్ కెమిస్ట్రీలో సివిక్స్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jaleel khan tdp
Updated:  2018-04-09 04:39:24

జ‌లీల్ స‌వాల్ కెమిస్ట్రీలో సివిక్స్ ?

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డినే టార్గెట్ గా చేసుకోవ‌డం తెలుగుదేశం నాయ‌కుల‌కు ప‌రిపాటిగా అల‌వాటుగా మారింది... ఇక ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని, వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ విమ‌ర్శ‌లుచేసి వారి ఇమేజ్ డ్యామేజ్ చేయాలి అనేది తెలుగుదేశం ప్లాన్.. ఇక ఆస్ధాన‌మీడియాల్లో కూడా తెలుగుదేశం ఇదే పందాలో కొన‌సాగుతోంది.
 
జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పై విమ‌ర్శ‌లు చేయ‌డం, ప‌లువేదిక‌ల పై జ‌గ‌న్ ని విమ‌ర్శించి, ఏపీకి బాబుగారు అన్ని తీసుకువ‌స్తున్నారు ఏపీకి ప్ర‌త్యేక హూదా కూడా వ‌చ్చేస్తోంది అనేలా ఆస్ధానమీడియాల్లో సెల్ప్ డ్ర‌మ్స్ కొట్టిస్తున్నారు త‌మ్ముళ్లు  అనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.
 
ఇక వైసీపీ ఎమ్మెల్యే నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యే అయ్యారు జ‌లీల్ ఖాన్ పార్టీ ఫిరాయించి... బీకాం ఫిజిక్స్ తో మ‌రింత సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యారు..ఆయ‌న తాజాగా ఓ స‌వాల్ చేశారు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఓడిపోతే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని, అలాగే తాను గెలిస్తే జ‌గ‌న్ రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటారా అని స‌వాల్ విసిరారు. పవన్‌ కల్యాణ్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఏపీకి మరో పదేళ్లు చంద్రబాబే సీఎం అని ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ స్పష్టం చేశారు.
 
అయితే ప‌దేళ్ల త‌ర్వ‌త చంద్ర‌బాబుని దిగిపోమ‌ని జీలీల్ ముందే చెబుతున్నారా... ఇక జ‌గ‌న్ కు స‌వాల్ ఎందుకు..? ముందు విజ‌య‌వాడ వైసీపీ నాయ‌కుల‌కు స‌వాల్ విస‌ర‌మ‌ని? అలాగే అస‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం టికెట్ ఇస్తుందో లేదో తెలియ‌దు అలాంటిది జ‌లీల్ ఖాన్ స‌వాల్ విస‌ర‌డం ఏమిట‌ని, ఇది కెమిస్ట్రీలో సివిక్స్ కాదు అంటున్నారు వైసీపీ నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.